రాష్ట్రీయం

3.3వేల కోట్లివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: కేంద్రం నుంచి వివిధ పథకాల కింద తెలంగాణాకు రావలసి ఉన్న 3,300 కోట్లరూపాయలను వెంటనే విడుదల చేయాలని ష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేటాయించిన పదికోట్ల పని దినాలకు అదనంగా మరో ఆరుకోట్ల పని దినాలు కేటాయించాలని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను సోమవారం కోరారు. లోక్‌సభలో టిఆర్‌ఎస్ పక్ష నేత జితేందర్ రెడ్డి, ఎంపి బిబి పాటిల్, రాష్ట్ర పంచాయితీరాజ్ కమిషనర్ నీతూప్రసాద్‌లతో కలిసి కేంద్రమంత్రితో సమావేశమయ్యారు. తెలంగాణాలో ఉపాధి హామీ పనులు లక్ష్యాన్ని మించి సాగుతున్నాయి కాబట్టి తమకు అదనంగా మరో ఆరు కోట్ల పని దినాలు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకానికి 786.66 కోట్ల రూపాయలను విడుదల చేయవలసి ఉండగా ఇంత వరకు రూ.378కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ప్రధాన మంత్రి గ్రామీణ రోడ్ల అభివృద్ధి పథకం నిధుల కేటాయింపులో తెలంగాణాకు అన్యాయం జరిగిందన్నారు. 2002-03లో కోర్ నెట్‌వర్క్ కింద దాదాపు 1469 కి.మీ. రహదారులను కేంద్రానికి తెలియజేయకపోవటం వల్ల రాష్ట్రానికి రూ.899 కోట్ల నష్టం కలిగిందన్నారు. తమ ప్రభుత్వం ఇప్పుడు ఇందుకు సంబంధించిన నివేదికను సవరించి పంపించినందున రాష్ట్రానికి 899 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కృష్ణారావు కేంద్ర మంత్రిని కోరారు. పని దినాలను వంద నుండి 150 పెంచితే కొత్తగా ఏర్పడిన జిల్లాలకు పని దినాలు కేటాయించేందుకు వీలుకలుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరుడు రాష్ట్రానికి 600కోట్ల రూపాయలు కేటాయించి విడుదల చేయలేదన్నారు. రూర్బన్ పథకం కింద పట్టణ ప్రాంతాల్లోని వసతులను గ్రామీణ ప్రాంతాల్లో కల్పించేందుకు అదనంగా మరిన్ని క్లస్టర్లను కేటాయించాలని నరేంద్ర తోమర్‌ను కోరినట్లు కృష్ణారావు చెప్పారు. డిడియుజికెవై నైపుణ్య అభివృద్ధి పథకం కింద 37,300 మందికి శిక్షణ మజూరు ఆయ్యింది, దీనికి అదనంగా మరో ముప్పై వేల మందికి నైపుణ్య శిక్షణ కేటాయించాలని కోరామన్నారు. రాష్ట్రంలోని జిల్లాల్లో నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జూపల్లి కృష్ణారావు తెలిపారు. మహిళా సంఘాలకు ఇచ్చే వడ్డీ రాయితీ పథకానికి 832 కోట్లు కేటాయించిన కేంద్రం ఇంతవరకు కేవలం 81కోట్లు మాత్రమే ఇచ్చింది, కేంద్రం మిగతా డబ్బును వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన స్ర్తి నిధి నుండి మహిళలకు ఇచ్చే రుణాలకు వడ్డీ రాయితీ ఇవ్వాలన్నారు. తాను ప్రస్తావించిన అన్ని అంశాలను సానుభూతితో పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని తోమర్ హామీ ఇచ్చినట్లు కృష్ణారావు తెలిపారు.
రాష్ట్రానికి రావలసిన నిధుల కేటాయింపులను కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీతోపాటు ఇతర శాఖల మంత్రులను కోరనున్నట్లు జితేందర్ రెడ్డి చెప్పారు. ఏయిమ్స్, ఐఐఎం స్థాపన గురించి జైట్లీ, వైద్య మంత్రి జెపినడ్డాను కోరుతామన్నారు. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని జైట్లీని కోరుతామని జితేందర్ రెడ్డి చెప్పారు.

చిత్రం..కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రితో సమావేశమైన మంత్రి జూపల్లి