రాష్ట్రీయం

వౌలిక సదుపాయాలతో మావోలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: అభివృద్ధి ముసుగులో తమ ఆధిపత్యం కోసం ఏజెన్సీ ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తోన్న వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా నిధులు వెచ్చిస్తోంది. సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్‌పెండిచర్ పథకం (నీతి ఆయోగ్) కింద ఈ నిధులు విడుదలవుతున్నాయి. దేశంలోని 10 రాష్ట్రాల పరిధిలోని 106 జిల్లాలు తీవ్రవాద ప్రాబల్యంగల ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఈ ప్రాంతాల అభివృద్ధికి కేద్ర ప్రభుత్వం రూ. 19.00 కోట్లు కేటాయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 25.60 కోట్లు, తెలంగాణకు రూ. 38.40 కోట్లు సిఏపిఎఫ్ కింద విడుదలయ్యాయి.
ఈ నిధులు గ్రామాల్లో వౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, ప్రాథమిక చికిత్స కేంద్రాలు, అంగన్‌వాడీ భవనాలు, స్కూళ్లు, గోడౌన్లు, మైనర్ ఇరిగేషన్, ఆరోగ్య కేంద్రాలతోపాటు విద్యార్థుల చదువుల కోసం ప్రత్యేక పాఠశాలలు వంటి నిర్మాణాలకు వెచ్చిస్తారు.
వామపక్ష తీవ్రవాదం అణచివేతే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నీతి ఆయోగ్ పథకం సత్పలితాలిస్తోందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకానికి తమ సంపూర్ణ మద్దతునిస్తున్నాయి. ప్రత్యేకించి కేంద్ర హోంశాఖ, ఇటెలిజెన్స్, నిఘా వర్గాల సూచనలతోనూ ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కొనసాగుతోంది. తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్, పశ్చిమ గోదావరి, గుంటూరు, కర్నూల్, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలోని ప్రాంతాల అభివృద్ధి జరుగుతోంది.
ఇప్పటి వరకు ఆంధ్రాలో 16 పోలీస్ స్టేషన్లకు భవన నిర్మాణాలు చేపట్టగా 11 పోలీస్ స్టేషన్లు పూర్తయ్యాయి. మరో ఐదు నిర్మాణంలో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో కొత్తగా 24 పోలీస్ స్టేషన్లకు భవన నిర్మాణాలు చేపట్టగా, వీటిలో 16 పోలీస్ స్టేషన్లు పూర్తికాగా, మరో 8 పోలీస్ స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లోని 106 జిల్లాలను కేంద్రం గుర్తించింది. వీటిలో బీహార్‌లో 22 జిల్లాలు, ఛత్తీస్‌గఢ్ 16, జార్ఖండ్ 21, మధ్యప్రదేశ్ 1, మహారాష్ట్ర 4, ఒడిశా 19, ఉత్తరప్రదేశ్ 3, వెస్ట్‌బెంగాల్‌లో 4 జిల్లాలను వామపక్ష తీవ్రవాద ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ జిల్లాలల అభివృద్ధికి కూడా ఇతోధికంగా నిధులు కేటాయించినట్టు అభివృద్ధి పర్యవేక్షణ విభాగం పేర్కొంది.