రాష్ట్రీయం

ప్రగతికి దారి.. క్లౌడ్ టెక్నాలజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 17: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ప్రపంచ ఆర్ధిక సదస్సు వేదికగా మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల సహా పలువురు పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ అయ్యారు. ఇ-గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో తమతో కలిసి పనిచేయాలని సత్య నాదెళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. హైబ్రిడ్ క్లౌడ్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా సత్య నాదెళ్ల సూచించారు. ఏపి, ఇండియాల్లో సాంకేతిక ప్రగతికి ఈ తరహా క్లౌడ్ టెక్నాలజీ దోహదం చేయగలదని అన్నారు. రాష్ట్రంలో రియల్ టైమ్ గవర్నెన్స్ తీసుకురావడంలో ప్రవేశపెట్టిన సాంకేతిక విధానాలను సత్య నాదెళ్లకు చంద్రబాబు వివరించారు.
తొలుత చంద్రబాబు షైర్ ఇంటర్నేషనల్ ఫార్మా అధిపతితో చర్చలు జరిపారు. ఔషధ రంగానికి అమరావతి అనుకూలంగా ఉంటుందని, హెడ్‌క్వార్టర్‌గా అమరావతిని మార్చుకోవచ్చని ఆహ్వానించారు. హీమోఫీలియా ట్రీట్‌మెంట్ రీసెర్చ్‌లో ముందంజలో ఉన్న ఈ సంస్థ పరిశోధన, అభివృద్ధి, సామర్థ్యాల పెంపుకోసం పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం కోసం ఆసక్తి కనబరుస్తోంది.
బర్కెలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఛాన్సలర్ నికోలస్ డక్స్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఇప్పటికే ఏపితో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. మోరి గ్రామంలో ఈ యూనివర్సిటీకి చెందిన సోలమన్ డార్విన్ కృషిని సిఎం ఈ సందర్భంగా గుర్తుచేశారు. అమరావతిని లెర్నింగ్, ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్న విధానాన్ని నికోలస్‌కు చంద్రబాబు వివరించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సహకారంతో నాలెడ్జ్ సొసైటీని రూపొందించాలని భావిస్తున్నామని తెలిపారు. దీనికోసం ఏపిలో ఏదో ఒక యూనివర్సిటీతో కలిసి పనిచేయాలని, రాష్ట్రాన్ని సందర్శించాలని చంద్రబాబు ఆహ్వానించగా నికోలస్ సానుకూలంగా స్పందించారు. అనంతరం చంద్రబాబును సూయెజ్ ఎన్విరాన్‌మెంట్ సిఇవో కలిశారు. జోర్డాన్‌లో సాగునీటి అవసరాలకు వాడే నీటిలో 10 శాతం నీరు సూయెజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా సరఫరా అవుతున్న నేపథ్యంలో పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ, వాటర్ ట్రీట్‌మెంట్ వ్యర్ధాల నుంచి విద్యుదుత్పత్తిచేసే ప్రాజెక్టుల్లో ఏపి అవసరాలకు తగినట్టు పనిచేయవచ్చని సూచించారు. ఏపికి ఒక బృందాన్ని పంపించాలని చంద్రబాబు కోరగా సంస్థ సిఇవో సానుకూలంగా స్పందించారు. జూరిచ్‌కు చెందిన బ్రూనో సాటర్‌తో చంద్రబాబు బేటీ అయ్యారు. స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ కార్యకలాపాల్లో డిజిటల్ లావాదేవీల గురించి సిఎం అడిగి తెలుసుకున్నారు. సైబర్ సెక్యూరిటీ సమస్యలేవీ లేవని బాబు అడిగిన ప్రశ్నకు బ్రూనో సమాధానం చెప్పారు.

చిత్రం..మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్లతో భేటీ అయన చంద్రబాబు