రాష్ట్రీయం

ఆగిన ఆరోగ్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 17: ఆరోగ్య పథకాల ధరల ప్యాకేజీ పెంపుపై జరుగుతున్న అంతులేని జాప్యానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ‘ఆషా’ పరిధిలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులన్నీ మంగళవారం తెల్లవారుజామునుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సేవలను పూర్తిగా నిలిపివేశాయి. అయితే మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యం మార్చి మాసాంతం వరకు ఉన్నందున ఉద్యోగులకు ఆ పథకం కింద చికిత్స చేయడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసేవరకు ఈ సమస్య పరిష్కారమయ్యేలా కన్పించడం లేదు. దారిద్య్రరేఖకు దిగువనున్న 80శాతం జనాభా లబ్ధిపొందేలా ఆరోగ్యశ్రీ పథకం కింద రూపొందించిన డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ధరలకే ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుచేయటం సాధ్యం కాదంటూ ‘ఆషా’ గత రెండేళ్లుగా ప్రభుత్వానికి నిక్కచ్చిగా చెబుతూ వస్తోంది. 2013 తర్వాత ఆసుపత్రుల నిర్వహణ వ్యయభారం అంతులేని విధంగా పెరుగుతున్నప్పటికీ ఏడాదికోసారైనా సమీక్షిస్తూ ధరలు పెంచాలనే డిమాండ్‌కు సిఎం ఎప్పటికప్పుడు సూత్రప్రాయంగా అంగీకరిస్తూ వస్తున్నారు. కానీ అమలు కాకపోవడం వల్ల ఏకంగా పథకం నిలిపివేతకు సిద్ధమయ్యారు. విజయవాడలో మంగళవారం అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మురళి మాట్లాడుతూ ధరల ఒప్పందానికి సంబంధించి ఆషా హాస్పటల్స్ కోర్ కమిటీ, రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు జితేంద్రశర్మ, ఉద్యోగుల సమాఖ్య ట్రస్టు ప్రధాన పర్యవేక్షకుల మధ్య అనేకమార్లు చర్చలు జరిగాయని చెప్పారు. ఈ సమస్య గత రెండేళ్లుగా పెండింగ్‌లో వుండగా, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పింక్ కార్డుదారుల కోసం ఆరోగ్యరక్ష అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని తాము ఎలా అమలు చేయగలుగుతామని ఆషా సభ్యులు ప్రశ్నించారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు సూచనపై ‘ఆషా’ ఇటీవల సహేతుకమైన, శాస్ర్తియబద్ధమైన ప్యాకేజీని సమర్పించినప్పటికీ ప్రభు త్వం ధరలను ఏమాత్రం సవరించలేకపోయింది. దాంతో ‘ఆషా’ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోటానికి సిద్ధవౌతోంది. తాము సూచించిన ధరలకు ఒప్పుకున్నా, లేక తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్యాకేజీ ధరలను ఇవ్వడానికి అంగీకరించినా తమ ఆసుపత్రిల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలుచేయగలమన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ‘ఆషా’ ప్రతినిధులు