రాష్ట్రీయం

విశాఖలో ట్విన్ టవర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 17: విశాఖను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ట్విన్ టవర్స్ నిర్మాణం చేపట్టనున్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆధ్వర్యంలో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చే విధంగా రెండు టవర్ల నిర్మాణం చేపట్టేందుకు నిర్మాణ సంస్థను ఇప్పటికే గుర్తించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌టి టక్కర్ వెల్లడించారు. ఐటి పరిశ్రమ అభివృద్ధిపై విశాఖలో అధికారులు, ఐటి కంపెనీల ప్రతినిధులతో మంగళవారం ఆయన సమావేశమై చర్చించారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ సిఇఓతో చర్చించిన మీదట కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. ట్విన్ టవర్స్ నిర్మాణంతో అందుబాటులోకి వచ్చే నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పలు ఐటి కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం విశాఖలో ఐటి పరిశ్రమ ద్వారా 18వేల మంది ఉద్యోగాలు పొందారని, ట్విన్ టవర్స్ అందుబాటులోకి వస్తే లక్ష మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. టవర్స్ నిర్మాణంతో ఇక్కడ ఐటి కంపెనీల కార్యకలాపాలు విస్తృతం అవుతాయని, ఆయ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల కోసం 10వేల ఇళ్లను నిర్మించి అందుబాటులో ఉంచనున్నట్టు వెల్లడించారు. ట్విన్ టవర్స్‌లో ఐదు నక్షత్రాల హోటల్ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. విశాఖలో ఐటి పరిశ్రమ ప్రోత్సాహానికి పలు అంశాలను ప్రతిపాదిస్తున్న ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఐటి సంస్థల ప్రతినిధులు టక్కర్‌ను కోరారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీసా ఆన్‌లైన్ ఎరైవల్ సదుపాయం లేదని, తక్షణమే ఈ సదుపాయం కల్పించాలని కోరారు. విశాఖ నుంచి విజయవాడ మీదుగా కొలంబోకు విమాన సర్వీసును నడపాలని, ఐటి సెజ్‌లో కొన్ని భూములను డీ నోటిఫై చేయాలని, ఐటి సంస్థలకు కేటాయించిన స్థలాల్లో ఆయా సంస్థలు కార్యకలాపాలు చేటపట్టేలా చూడాలని, లేని పక్షంలో ఆయా సంస్థల విషయంలో ఏదో నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఐటి సంస్థల ప్రతినిధుల సమస్యలపై స్పందించిన సిఎస్ టక్కర్ విశాఖ ఎయిర్‌పోర్టులో వీసా ఆన్‌లైన్ ఎరైవల్ సదుపాయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర హో మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు మాట్లాడుతూ విశాఖలో ప్రతి ఏటా 40 టన్నుల రెడీమేడ్ వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నామని, వీటిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు చెన్నై తరలించాల్సి వస్తోందని టక్కర్‌కు విన్నవించారు. దీనిపై స్పందించిన సిఎస్ కొలొంబోకు నేరుగా విమానాన్ని నడిపేందుకు పౌర విమానయాన శాఖకు లేఖ రాస్తామని హామీ ఇచ్చారు.

చిత్రం..విశాఖలో ఐటి కంపెనీల ప్రతినిధులతో చర్చిస్తున్న సిఎస్ టక్కర్