రాష్ట్రీయం

హెచ్‌సియు ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో మరోమారు ఉద్రిక్తతలు తలెత్తాయి. రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడి ఏడాది గడచిన సందర్భంలో జాయింట్ యాక్షన్ ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో విద్యార్ధులు నివాళి అర్పించేందుకు సిద్ధమైనపుడు పోలీసులు గేటు వద్దే అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వర్ధంతిలో పాల్గొనేందుకు వెళ్లిన రోహిత్ తల్లి, వివిధ పార్టీల నేతలను గేటువద్దే పోలీసులు అడ్డుకోగా, కవరేజీకి వెళ్లిన మీడియాను వర్శిటీ సెక్యూరిటీ అడ్డగించింది. కొంతమంది మీడియా ప్రతినిధులు సెక్యూరిటీని దాటుకుని లోపలికెళ్లడంతో వారిపై యూనివర్శిటీ ట్రెస్‌పాసింగ్ కేసులకు సిద్ధమైంది. ఒకదశలో విద్యార్థులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రోహిత్ వేముల ఆత్మహత్య సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో వర్శిటీ అధికారులు ఒక విచారణ కమిటీని సైతం నియమించారు. కమిటీ ఇచ్చిన నివేదికపై జాయింట్ యాక్షన్ ఫర్ సోషల్ జస్టిస్ నేతలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. వేముల ఆత్మహత్యతో గతంలో తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడికిన సెంట్రల్ వర్శిటీ ఏడాది తర్వాత మళ్లీ అలాంటి వాతావరణాన్ని చవిచూసింది. రోహిత్ వేముల వర్ధింతి సందర్భంగా వామపక్షాలన్నీ దళిత విద్రోహ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించడంతో వర్శిటీ ప్రాంగణంలో సొంత భద్రతా సిబ్బందితోపాటు పోలీసులను సైతం భారీగా మోహరించారు. ముందు ప్రకటించినట్టే వర్శిటీ క్యాంపస్‌లోనే రోహిత్ వర్ధంతి సభ జరిపి తీరుతామని విద్యార్థులు భీష్మించారు. సభలో పాల్గొనేందుకు దేశంలోని పలు వర్శిటీల నుంచి విద్యార్థులు, ప్రొఫెసర్లు, ప్రజా సంఘాల నేతలు తరలివచ్చారు. కానీ సభకు అనుమతి లేదని చెప్పి పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఒకదశలో ఇరు పక్షాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. విద్యార్థుల ర్యాలీకి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఒకదశలో రోహిత్ స్థూపానికి నివాళి అర్పించేందుకు వచ్చిన రోహిత్ తల్లిని పోలీసులు అడ్డుకున్నారు. మరోపక్క వర్శిటీలోపలవున్న విద్యార్థులు వసతి గృహం నుండి ప్రధాన ద్వారం వరకూ భారీగా ర్యాలీ నిర్వహించారు. బయటకెళ్లి ఆందోళన చేసేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. గేటులోపల కొంతమంది విద్యార్థులు, గేటుబయట ఆప్ నేతలు, విద్యార్ధి సంఘాల నేతల ఆందోళనతో వర్శిటీ మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. పోలీసు గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు.
మీడియాపై ఆంక్షలు
హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలోకి మీడియా రాకుండా రిజిస్ట్రార్ ఆంక్షలు విధించారు. మీడియాకు ఏమైనా సమాచారం కావాలనుకుంటే ఈ-మెయిల్ పంపాలని సూచించారు. మీడియా తమ గుర్తింపు కార్డులను చూపించినా సెక్యూరిటీ లోపలికి అనుమతించలేదు. ఫ్రంట్‌లైన్‌కు చెందిన రిపోర్టర్ కునాల్ శంకర్ తన గుర్తింపుకార్డు చూపించి లోపలికెళ్లడంతో వర్శిటీ పెద్దలు ట్రెస్‌పాస్ కేసు బనాయించారు. మిషన్ కాకతీయపై ప్రాజెక్టు రిపోర్టు రాసి తెలంగాణ ప్రభుత్వ అవార్డు పొందిన జర్నలిస్టుకే ఈ గతి పడితే మిగిలిన వారి సంగతి ఏమిటని జర్నలిస్టు సంఘాలు తీవ్ర నిరసన తెలిపాయి
. రోహిత్ వేముల చట్టం చేయాలి
రోహిత్ వేముల ప్రథమ వర్ధంతి సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో వామపక్షాల సభ జరిగింది. సభలో రోహిత్ వేములకు నివాళి అర్పించిన నేతలు రోహిత్ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.

చిత్రం..వర్శిటీ లోపల ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థినీ విద్యార్థులు