రాష్ట్రీయం

విశ్వనగరం సాధ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: ‘విశ్వ నగరావిష్కరణ ఒక్కరోజులో సాధ్యమయ్యేది కాదు. సమష్టి ప్రయత్నంతోనే సాధ్యం. హైదరాబాద్ అభివృద్ధికి అవసరమైన బృహత్తర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం’ అని మున్సిపల్ మంత్రి కె తారక రామారావు అసెంబ్లీలో ప్రకటించారు. రాజధాని అభివృద్ధి ప్రణాళికలపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన లఘు చర్చలో వివిధ అంశాలను మంత్రి వివరించారు. 50 వేల కుటుంబాలున్న 200 మురికివాడలకు ఫిబ్రవరి నుంచి రోజూ మంచినీరు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మార్చినాటికి సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాంతాలకు రోజూ మంచినీటి సరఫరా విస్తరించనున్నట్టు వివరించారు. అలాగే, 19 వందల కోట్ల వ్యయంతో 13 శివారు మున్సిపాల్టీల్లో మంచినీటి సరఫరాకు ఏర్పాట్లు చేశామన్నారు. మూడు ప్యాకేజీలుగా ప్రాజెక్టు పనులు చేపట్టామన్నారు. 2600 కిలోమీటర్ల పైపులైన్ నెట్‌వర్క్ వేయాల్సి ఉందని, ఇప్పటి వరకు 550 కిలోమీటర్ల పైపులైన్ పూర్తి చేశామన్నారు. ఒప్పందం ప్రకారం 2018 ఫిబ్రవరి నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. 50 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శామీర్‌పేట, దేవలమ్మ నగరం వద్ద రెండు నీటి నిల్వ రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్టు చెప్పారు. 7770 కోట్ల అంచనా వ్యయంతో కేశవపురం రిజర్వాయర్ కోసం మెస్సర్ వాప్కోస్ కన్సల్టెంట్స్‌కు డిపిఆర్ సమర్పించామన్నారు. హుస్సేన్‌సాగర్‌కు చేరుతున్న కూకట్‌పల్లి నాలా మురుగును 40 కోట్ల వ్యయంతో మళ్లించినట్టు వివరించారు.
మూసీ శుద్ధి, సుందరీకరణ నిర్మాణాల కోసం ప్రత్యేకంగా రివర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నామన్నారు. మూసీ పరివాహకంలో 10 స్థలాలు ఎంపిక చేసి, 610 ఎంఎల్‌డిల ఎస్టీపీలు నిర్మించనున్నట్టు చెప్పారు. ప్రాజెక్టు వ్యయం 12 వందల కోట్లుగా వివరించారు. శివారు సర్కిళ్లలో 3067 కోట్ల వ్యయంతో డ్రెయినేజీ సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
రహదారుల అభివృద్ధి
మహానగర రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
చెప్పారు. వాహన రద్దీ, కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్కైవేలు, రోడ్ కారిడార్లు, గ్రేడ్ సెపరేటర్ల అంశాలతో వ్యూహాత్మక రవాణా మార్గాల అభివృద్ధి ప్రణాళిక రూపొందించామన్నారు. 19వేల 263 కోట్ల వ్యయంతో నాలుగు దశల్లో పనులు చేపట్టామన్నారు. సైబరాబాద్ ఐటి కారిడార్‌లో 115.46 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. నీటి ముంపునకు శాశ్వత పరిష్కారంగా 45 ప్రాంతాలను గుర్తించి వైట్ టాపింగ్, పేపర్ బ్లాక్‌లను వేయనున్నట్టు వివరించారు.
నగరంలో పెరుగుతున్న ప్లాస్టిక్ విసర్జనను సమర్ధంగా వాడుకోవడానికి ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణ యోచన ఉందన్నారు. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా ఉప్పల్‌లో వేసిన రెండు కిలోమీటర్ల ప్లాస్టిక్ రోడ్డు సక్సెస్ అయ్యిందన్నారు. దీంతో అనేక సర్కిళ్లలోని అంతర్గత కాలనీల్లో ప్లాస్టిక్ రోడ్లు వేయనున్నట్టు చెప్పారు.
దుర్గంచెరువు బ్రిడ్జి
జూబ్లీహిల్స్‌తో మాదాపూర్, హైటెక్ సిటీని అనుసంధానించేందుకు 184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువుపై దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద కేబుల్ స్టేయిడ్ బ్రిడ్జి ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఎల్ అండ్ టికి పనులు అప్పగించామన్నారు. హైచ్‌ఎండిఏ పరిధి 11 జిల్లాలకు విస్తరించిందని, వెయ్యి కోట్ల వ్యయంతో హబ్సిగూడ నుంచి బోగారం, మిథాని నుండి ఆదిబొట్ల, నాగోల్ నుంచి సింగారం మీదుగా ఘట్‌కేసర్ వరకు ఏరియల్ రోడ్లు నిర్మించనున్నట్టు చెప్పారు. హుసేన్‌సాగర్ శుద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. బాట సింగారం, మంగళపల్లి వద్ద రెండు లాజిస్టిక్ పార్కులు మంజూరు చేశామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, 45 ప్రాంతాల్లో 19వేల 500 ఇళ్లకు టెండర్లు పిలిచామన్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతమున్న సాంప్రదాయ బల్బుల స్థానే ఎల్‌ఇడిలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. భవన నిర్మాణాల అనుమతులకు ప్రజలు ఇబ్బందిపడకుండా దరఖాస్తు చేసిన 30 రోజుల్లో అనుమతిచ్చేలా డిపిఎంఎస్ విధానం అమలు చేస్తామన్నారు. 30 రోజుల్లో అనుమతి ఇవ్వకుంటే అనుమతి లభించినట్టే భావించవచ్చన్నారు. మున్సిపల్ ఉద్యోగులకు బదిలీ లేక పోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏకీకృత సర్వీసు విధానం తీసుకొచ్చామన్నారు. మున్సిపల్ ఉద్యోగులను ఇప్పుడు రాష్ట్రంలోని ఏ మున్సిపాల్టీకైనా బదిలీ చేసే అవకాశం ఉందని కెటిఆర్ వెల్లడించారు.