ఆంధ్రప్రదేశ్‌

కాళహస్తి రాజగోపురం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, జనవరి 18: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన గాలిగోపురం పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ గోపుర ప్రారంభ సూచికగా గురువారం నుంచి విశ్వకల్యాణ శాంతి మహాయజ్ఞం జరుగనుంది. 19వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అతిరుద్రయాగం నిర్వహించడానికి నవయుగ నిర్మాణ సంస్థ ఏర్పాటుచేసింది. సుమారు రూ.50 కోట్ల రూపాయల వ్యయంతో నవయుగ నిర్మాణ సంస్థ ఈ గాలిగోపురాన్ని నిర్మించింది. శ్రీ కృష్ణదేవరాయులు 1516లో నిర్మించిన 135 అడుగుల ఎతె్తైన రాజగోపురం 2010 మే 25న కూలిపోవడం తెలిసిందే. ఈ గోపురాన్ని పునర్నిర్మించడానికి నవయుగ నిర్మాణ సంస్థ ముందుకువచ్చింది. 2010 నవంబర్‌లో ముఖ్యమంత్రి రోశయ్య గోపురం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాత కట్టడంలాగే మొదటి అంతస్తును 30 అడుగుల వరకు రాతితో నిర్మించారు. ఆ తరువాత ఇటుకలతో, సున్నంతో నిర్మించారు. సున్నంలో బెల్లం, కరక్కాయ లాంటి మూలికలను వేసి నిర్మించారు. అంతేకాకుండా 15 అడుగుల పునాదిని కూడా వేశారు. వివిధ కారణాల వల్ల నిర్మాణాల్లో ఆలస్యమైంది. 2017 ఫిబ్రవరి 7,8,9 తేదీల్లో శ్రీ కాళహస్తీశ్వరాలయానికి కుంభాభిషేకం జరపడానికి ట్రస్టుబోర్డు నిర్ణయించింది. దానికన్నాముందే గోపురం నిర్మాణాన్ని పూర్తిచేసి అప్పగించడానికి నవయుగ నిర్మాణ సంస్థ నిర్ణయించింది. ఎన్ని ఇబ్బందులున్నా ముందుగానే నిర్మాణం పూర్తిచేసి గోపురానికి రంగులు కూడా వేశారు. 135 అడుగుల ఎత్తులో ఏడు అంతస్థులతో నిర్మించిన రాజగోపురానికి మంగళవారం ప్రత్యేకంగా వివిధ రకాల విద్యుత్ దీపాలను కూడా అమర్చారు. విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోయిన గాలిగోపురాన్ని చూసి పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. గోపురం పైన ప్రతిష్టించే 9 కలశాలకు బంగారుపూతను వేయించారు. బుధవారం సాయంత్రం అంకురార్పణతో అతిరుద్రయాగం కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 7,8,9 తేదీల్లో కుంభాభిషేకం జరుగనుంది.

శ్రీకాళహస్తిలో నవయుగ నిర్మాణ సంస్థ
నిర్మించిన ఏడు అంతస్థుల గాలిగోపురం