రాష్ట్రీయం

రాష్ట్రానికి చైనా కంపెనీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 19: ఆంధ్రప్రదేశ్‌కు, అమరావతికి ఆర్థిక వనరులు పెట్టుబడులను సమకూర్చడంలో చైనాకు చెందిన ‘మెకెన్సీ గ్లోబల్’ ముఖ్య భూమిక పోషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. ఇందుకోసం సంస్థలోని మేధావులతో ఒక బృందాన్ని ఏర్పాటుచేసి, తమ రాష్ట్రానికి పెట్టుబడులు సమకూర్చే బాధ్యతను ఆ బృందానికి అప్పగించాలని కోరారు.
దావోస్ ప్రపంచ ఆర్థికవేదిక సదస్సులో బుధవారం తనతో భేటీ అయిన ‘మెకెన్సీ గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్’ సంచాలకుడు జోనాథన్ ఓజల్‌తో ఆయన చర్చించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ‘మెకెన్సీ గ్లోబల్’ క్రియాశీలకపాత్ర పోషించాలని కోరారు. జోనాథన్ ఓజల్ మాట్లాడుతూ అంతర్జాతీయ వాణిజ్యంలో భవిష్యత్ అంతా భారత్, చైనా దేశాలదేనన్నారు. ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 25శాతం ఈ రెండు దేశాల నుంచే వస్తుందని, సాంకేతికత కూడా ఈ ఉభయ దేశాలదే వుంటుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు చైనా పెట్టుబడుల రాకను సులభతరం చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. రానున్న మూడు మాసాల్లో చైనా నుంచి 20 ప్రధాన వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను రాష్ట్రానికి తేవటంలో, పెట్టుబడిదారులు రావటంలో తాము తోడ్పడతామని జోనాథన్ ఓజల్ వివరించారు.
జేపీ మోర్గాన్‌తో చర్చలు
జేపీ మోర్గాన్ ఛేస్ వాణిజ్య వ్యూహ విభాగ అధిపతి మాక్స్ న్యూకిర్షెన్‌తో సిఎం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో సహజ వనరులు, అపరిమిత అవకాశాలపై ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. ఆర్థిక, సాంకేతికాంశాల్లో తమ ప్రభుత్వానికి సహకరించాలని మాక్స్ న్యూకిర్షెన్‌ను కోరారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఐఓటి పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో చెబుతూ ‘కోర్ డ్యాష్‌బోర్డు’ ప్రత్యేకతను వివరించారు. సంస్థకు వున్న అంతర్జాతీయ కార్యవ్యవస్థ ద్వారా అమరావతి అభివృద్ధికి పెట్టుబడులు వచ్చేలా చూడాలని కోరారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సపోర్టింగ్ షీట్ల తయారీలో ప్రసిద్ధి చెందిన టీజిన్ లిమిటెడ్ సంస్థ అధ్యక్షుడు జున్ సుజుకీ చంద్రబాబుతో సమావేశమయ్యారు. అనేక రంగాల్లో ప్రసిద్ధి చెందిన టీజిన్ ఆంధ్రప్రదేశ్‌ను తన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జున్ సుజుకీని కోరారు. పారిశ్రామికాభివృద్ధి కోసం సింగిల్ డెస్క్ పాలసీని అనుసరిస్తున్నామని, అన్ని అనుమతులను మూడు వారాల్లో ఇస్తామన్నారు. కార్బన్, అల్యూమినియం, ఫైబర్స్‌లో టీజీన్ రంగాల్లో టీజిన్‌కు అనుభవం వుంది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సపోర్టింగ్ షీట్స్ తయారీలో కూడా ప్రసిద్ధి చెందింది.
తిరుపతి అభివృద్ధికి కుమియుమి
తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేయటానికి జపాన్‌కు చెందిన ‘కుమియుమి అస్సెట్స్ కంపెనీ’ ముందుకు వచ్చింది. బుధవారం దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, కుమియుమి అస్సెట్స్ కంపెనీ ప్రెసిడెంట్ యసుయో యమజకి సమావేశమయ్యారు. ఇప్పటికే వారణాసి నగరాభివృద్ధిలో భాగస్వామిగా వున్నామని, తిరుపతి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
గృహ నిర్మాణం, ఉద్యోగాల కల్పన, వ్యవసాయ రంగాల్లో జపాన్ కంపెనీలతో కన్సార్టియంగా ఏర్పడి 15 నుంచి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడిని తీసుకురాగలమని కుమియుమి ప్రెసిడెంట్ ప్రతిపాదించగా, స్పష్టమైన ప్రణాళికతో రావాలని చంద్రబాబు సూచించారు.
బాబుకు సిస్కో చైర్మన్ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లో డిజిటలైజేషన్ దిశగా తీసుకుంటున్న చర్యలపై ఐఎంఎఫ్, వరల్డ్‌బ్యాంక్ సదస్సుల్లోప్రశంసలు వచ్చాయని సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్ తెలిపారు. బుధవారం దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనతో భేటీ అయినప్పుడు వివిధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి సిస్కో చైర్మన్‌కు వివరించారు.
జనరల్ అట్లాంటిక్ ఎండితో భేటీ
భారత్‌లో తాము 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు జనరల్ అట్లాంటిక్ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ సందీప్ నాయక్ తెలిపారు. సి ఎంతో జరిగిన చర్చల నేపథ్యంలో ఆయన ఈ అంశాన్ని వివరిస్తూ తమ సంస్థ 30 బిలియన్ డాలర్ల సామర్ధ్యం వుందని, ఐటి, హెల్త్‌కేర్ వంటి ప్రధాన రంగాల్లో పెట్టుబడులు పెడుతుందన్నారు.
గడ్కరీతో బాబు అల్పాహారం
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ముఖ్యమంత్రి అల్పాహార విందు తీసుకున్నారు. భోజన ప్రియుడైన నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్ ఘుమఘుమలను, ప్రత్యేక వంటకాల రుచులను బుధవారం అడిగి తెలుసుకున్నారు.

చిత్రం..జోనాథన్ ఓజల్‌ను జ్ఞాపికతో సత్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు