రాష్ట్రీయం

అభివృద్ధికి వ్యతిరేకం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 19: రాజధాని పేరుతో ప్రతిదీ ఓ కుంభకోణంగా మారుతోంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు దేశాలు తిరుగుతూ మాస్టర్ ప్లాన్‌లు రూపొందిస్తున్నామంటూ జనాల్ని వంచిస్తున్నారు.. తన వారికి భూములు కట్టబెట్టి కమిషన్లు దండుకుంటున్నారు. అభివృద్ధికి, రాజధానికి మేం వ్యతిరేకంకాదు..దానివల్ల జరిగే మోసాలనే ప్రశ్నిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి బలవంతపు భూ సేకరణవల్ల, రోడ్ల విస్తరణవల్ల ఇళ్లు కోల్పోతున్న బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్నదంతా బూటకమన్నారు. రాష్ట్ర విభజన జరిగి రాజధాని అనే్వషణ చేస్తున్న సమయంలో ఆంధ్ర యూనివర్శిటీ వద్ద వస్తోందని..నూజివీడులో వస్తోందని లీకులుతెచ్చి అందరినీ మభ్యపెట్టి అయినవాళ్ల చేత తుళ్లూరులో కారుచౌకగా భూములు కొనుగోలు చేయించారని ధ్వజమెత్తారు. ఆ భూములు మినహా మిగిలినవన్నీ ల్యాండ్ పూలింగ్‌లో సేకరించి విదేశీ బహుళ జాతి కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మొత్తం 27వేల ఎకరాల భూములతోపాటు మరో 21వేల ప్రభుత్వ అసైన్డ్, 21 వేల వక్ఫ్ భూములు సేకరించారని సమీకరణ నిరాకరించిన రైతుల వద్దనుంచి బలవంతంగా 6 వేల ఎకరాల్లో సేకరణకు అడ్డగోలు గ్రామసభలు నిర్వహించి నోటిఫికేషన్ జారీ చేశారని ఆరోపించారు. తన బినామీలు కొనుగోలు చేసిన భూముల్ని రెసిడెన్షియల్, పరిశ్రమలు, ఇతర అభివృద్ధి కింద జోనింగ్ ఇచ్చి రైతుల భూములు మాత్రం వ్యవసాయజోన్ కింద అమ్మకానికి నిషేధం అనే ఆంక్షలు విధించారన్నారు. రాజధాని ప్రాంత రైతు కూలీలకు 2500 ఫించన్లు ఇవ్వటంలో వివక్షత చూపుతున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు చెందిన వారి ఇళ్లను ఎక్స్‌ప్రెస్ హైవే సాకుతో రోడ్ల నిర్మాణంలో భాగంగా వందలాది మంది నిరుపేదల ఇళ్లను కూల్చివేసి వారిని రాజధాని నుంచి తరిమివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. రాజధాని ప్రాంతంలో మినహా రాష్ట్రం మొత్తంగా భూముల విలువను పెంచారని, భూములిచ్చిన రైతులకు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం బాబు నైజానికి నిదర్శనమన్నారు. అసైన్డ్ భూములు, పట్టా భూముల్లో నివసిస్తున్న నిరుపేద దళితులను బ్లాక్‌మెయిల్‌చేసి అడంగళ్‌ను మార్చడం ద్వారా ప్రభుత్వభూములుగా చూపి ఖాళీచేయాలని బెదిరించటం అమానుషమన్నారు. స్విస్ ఛాలెంజి పద్ధతి అంటూ 1691 ఎకరాల భూమిని చౌకధరకు సింగపూర్ సంస్థలకు కట్టబెట్టడంతోపాటు వౌలిక సదుపాయాల కల్పనకు 5వేల కోట్లకు పైగా ఖర్చుపెడతామని చెప్పడం దౌర్భాగ్యమన్నారు. రాజధానిలో ఏ ప్రాంతంలో ఏముందనేది ఎవరికీ అంతుచిక్కటంలేదన్నారు. తాత్కాలిక సచివాలయానికి చదరపు అడుగు 10వేల చొప్పున లెక్కగట్టి 650 కోట్లతో నిర్మించారని, ఇదే ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బిల్డర్లు చదరపు అడుగు 16వందలకు కట్టుబడి చార్జీలు వసూలు చేస్తున్నారని తెలిపారు. శాశ్వత భవనాలకు ఒక్క ఇటుక కూడా వేయలేదని చెప్తూ మరో రెండేళ్లు ఓపిక పట్టండి.. 500 ఎకరాల్లో శాశ్వత రాజధానిని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తుంది రైతులనుంచి బలవంతంగా తీసుకున్న భూములు తిరిగి ఇచ్చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు.

చిత్రం..గురువారం నిడమర్రు బహిరంగ సభలో మాట్లాడుతున్న జగన్