రాష్ట్రీయం

ఆఫీసులన్నీ ఒకేచోట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19:అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత కార్యాలయాల సముదాయాలను ఏడాదిలోగా నిర్మించేందుకు డిజైన్లు ఖరారు చేసి టెండర్లను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. వీటి నిర్మాణానికి ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తామన్నారు. నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో నిర్మించిన కలెక్టరేట్లు కొత్తవి కావడంతో వాటిని మినహాయించి మిగిలిన 28 జిల్లా కేంద్రాలలో సమీకృత కార్యాలయాలను నిర్మాణానికి డిజైన్లు తయారు చేయాల్సిందిగా రోడ్లు భవనాలశాఖను ఆదేశించారు. జిల్లా కార్యాలయాల నిర్మాణంపై గురువారం ప్రగతి భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్‌అండ్‌బి ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి తదితర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యాలతో ఏర్పాటుచేసిన కొత్త జిల్లాల్లో పాలనా కార్యకలాపాలు సమర్థవంతంగా నిర్వహించడానికి కార్యాలయాలు అత్యవసరమని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లా కేంద్రాలలో పోలీస్, అగ్నిమాపక శాఖలు మినహాయించి మిగతా కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా సమీకృత జిల్లా కార్యాలయ భవనాలను నిర్మించాలని అభిప్రాయపడ్డారు. కార్యాలయాలకు వచ్చే ప్రజానీకానికి, పనిచేసే అధికారులకు సౌకర్యంగా ఉండేవిధంగా నిర్మాణాలు ఉండాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు జిల్లాలకు వచ్చినప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించుకునేందుకు అనువుగా డిజైన్ చేయాలన్నారు. వెలుతురు, గాలితోపాటు పచ్చదనం ఉట్టిపడేలా ల్యాండ్ స్కేపింగ్, వాకింగ్ ట్రాక్స్, విశాలమైన పార్కింగ్ వంటి సదుపాయాలు ఉండాలన్నారు. ప్రతీ కార్యాలయంలో వెయ్యి మందికి సరిపడేలా సమావేశ మందిరం, కార్యాలయ ఆవరణలోనే బ్యాంక్, ఎటిఎం, మీ సేవా కేంద్రాలు వంటివి నిర్మించడానికి సరిపడేలా 20-25 ఎకరాల స్థలం ఉండాలన్నారు. సమీకృత కార్యాలయాలకు ఇప్పటికే స్థలాల ఎంపిక జరిగిందని, వాటికి లే అవుట్లను రూపొందించాలన్నారు. అలాగే జిల్లా కేంద్రాలు అన్నింటికి పరేడ్ గ్రౌండ్‌తో కూడిన పోలీసు కార్యాలయాలు నిర్మించాలని ఆదేశించారు. తమిళనాడులో జిల్లా పోలీస్ కార్యాలయాలు బాగున్నాయని, డిజిపి నేతృత్వంలో అధికారుల బృందం అక్కడికి వెళ్లి పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయాలలో క్రైమ్ మీటింగ్‌లు నిర్వహించుకోవడానికి కాన్ఫరెన్స్ హాల్స్ నిర్మించాలని పోలీస్ అధికారి ఒకరు సూచించగా ‘క్రైమ్ మీటింగులేంటి? ముందు పోలీసులు నేర భాష మార్చుకోవాలి’ అన్నారు. పోలీసులు తమ మీటింగులకు చక్కటి పేరు పెట్టుకోవాలని సూచించారు.

చిత్రం..జిల్లా భవనాలపై అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్