రాష్ట్రీయం

మా రాష్ట్రానికి రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19:తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు నిర్వహించేందుకు ముందుకొచ్చే కొరియన్ సంస్థలకోసం హైదరాబాద్‌లో ఓ ఇండస్ట్రియల్ పార్క్ నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి కెటిఆర్ సియోల్‌లోని భారత ఛాంబర్ ఆఫ్ కామర్స్ దక్షిణ కొరియాకు హామీ ఇచ్చారు.
దక్షిణ కొరియాకు చెందిన పలు ప్రముఖ కంపెనీలతో ఐటి మంత్రి కెటిఆర్ గురువారం సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం శామ్‌సంగ్ కంపెనీ సీనియర్ ఉపాధ్యక్షుడు సంగ్ మో యిమ్, ఉపాధ్యక్షుడు పీటర్ రీలతోభేటీ అయ్యారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ తయారీ అవకాశాలపై ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగాయి. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు కల్పిస్తున్న వౌలిక వసతులు, ప్రత్యేక పారిశ్రామిక విధానం గురించి కెటిఆర్ వివరించారు. తమ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ డివైజ్ మాన్యుఫాక్చరింగ్ పార్క్‌లో యూనిట్ ఏర్పాటు చేయాలని శామ్‌సంగ్ సంస్థ ప్రతినిధులను కెటిఆర్ కోరారు. అనంతరం శామ్‌సంగ్ ఇన్నోవేషన్ మ్యూజియాన్ని కెటిఆర్ సందర్శించారు. భారత చాంబర్ ఆఫ్ కామర్స్ దక్షిణ కొరియా ఏర్పాటుచేసిన వ్యాపారవేత్తల సమావేశంలో కెటిఆర్ ప్రసంగించారు. సియోల్‌లో జరిగిన ఈ సమావేశానికి వందకు పైగా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అనుకూల అంశాలు, ప్రభుత్వ విధానాలపై కెటిఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్, లైఫ్ సైనె్సస్, ఆటోమోటివ్, మెషినరీ, ఇంజనీరింగ్‌వంటి రంగాల్లోని సంస్థలకు ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్న అవకాశాలు, సౌకర్యాలను, ప్రభుత్వం అందించే సహకారాన్ని కెటిఆర్ వివరించారు. కొరియాలోని భారత రాయబారి విక్రం దొరైస్వామి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో కొరియా సంస్థల కోసం ప్రత్యేకంగా కొరియన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు వచ్చే ప్రతి కొరియన్ సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని కెటిఆర్ తెలిపారు.

చిత్రం.. శామ్‌సంగ్ కంపెనీ సీనియర్ ఉపాధ్యక్షుడు సంగ్ మో యిమ్, ఉపాధ్యక్షుడు పీటర్ రీలతో భేటీ అయన కెటిఆర్