రాష్ట్రీయం

9వేల పోస్టులు భర్తీ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా గడచిన రెండున్నరేళ్లలో ఆరు వేల పోస్టులను భర్తీ చేశామని, త్వరలో మరో 9వేల పోస్టులను భర్తీ చేస్తామని కమిషన్ చైర్మన్ డాక్టర్ ఘంటా చక్రపాణి చెప్పారు. 2011 గ్రూప్-1 ఫలితాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన కమిషన్ సభ్యులతోపాటు గవర్నర్ నరసింహన్‌ను కలిసి కమిషన్ పనితీరుపై నివేదికను సమర్పించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రూప్-1 ప్రక్రియ ముగిసిన తర్వాత గ్రూప్-2 ఎంపిక ప్రక్రియ చేపడతామన్నారు. ఇప్పటివరకూ తాము నిర్వహించిన పరీక్షలు, ప్రకటించిన ఫలితాలు, ఇచ్చిన ఉద్యోగాలకు సంబంధించి వివరాలు, ఏడాది కాలంలో సాధించిన ప్రగతిని ఈ నివేదికలో పొందుపరిచామని అన్నారు. కమిషన్ పనితీరుపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. రెండున్నరేళ్ల కాలంలో ఇంతవరకూ ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. కొన్ని ఇంటర్వ్యూలు దశలో ఉన్నాయని, అవి కూడా పూర్తయితే 5996 ఉద్యోగాలు ఇచ్చినట్టవుతుందని అన్నారు. గ్రూప్-2కు సంబంధించి తుది కీ ఖరారైందని, ఫలితాలను రోస్టర్ ప్రాతిపదికపై ప్రకటిస్తామని అన్నారు. గ్రూప్-2 కంటే ముందు 2011 గ్రూప్-1 ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. వాటికి సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. త్వరలోనే కొత్త నోటిఫికేషన్లు ఇస్తామని, ముఖ్యంగా ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో టీచర్ల నియామకం చేపడతామని అన్నారు. ఇప్పటికే నియామకాల ఇండెంట్ అందిందని, మరికొన్ని శాఖల వారీ అందాల్సి ఉందని చెప్పారు. ఖాళీల వివరాలు పూర్తిగా రాగానే ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుందని, అపుడే నోటిఫికేషన్ ఇస్తామని ఆయన వివరించారు.