రాష్ట్రీయం

ట్రైనీ ఎస్‌ఐ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: హైదరాబాద్ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఓ ఎస్‌ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హర్యానాకు చెందిన సచిన్ (25) హకీంపేటలోని సిఐఎస్‌ఎఫ్ కేంద్రంలో గత అక్టోబర్ నుంచి ఎస్‌ఐగా శిక్షణ పొందుతున్నాడు. అతను తన గదిలో ఉరేసుకున్నట్టు సహచరులు గమనించి, అధికారులకు ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే ఎస్‌ఐ బలవన్మరణానికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సచిన్ కుటుంబీకులకు సమాచారం ఇచ్చామని, మృతదేహాన్ని హర్యానాకు తరలించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.