రాష్ట్రీయం

సాధించి చూపాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 20: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన డిజిటల్ ఇండియా పిలుపును అందుకుని ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో శుక్రవారం ‘ఇంటర్నెట్ ఫర్ ఆల్’ అంశంపై ప్రత్యేక చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న చంద్రబాబు తక్కువ వ్యయంతో ఇంటింటికీ ఇంటర్‌నెట్ ఎలా సాధ్యమో వివరించారు. తాము చేపట్టిన ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ వ్యయం 9 బిలియన్ డాలర్లు అవుతుందని, అంత వ్యయాన్ని భరించే శక్తి తమకు లేకపోవటంతో ప్రాజెక్టు అధికారులతో ఒక మేధోమధన సమావేశం నిర్వహించి పరిష్కారం కనుగొన్నట్లు చెప్పారు. ప్రతి ఇంటికీ కరెంటు స్తంభాల ద్వారా విద్యుత్ కనెక్షన్లున్నాయని, ఈ స్తంభాలనే వినియోగించుకోవాలన్న ఆలోచన రావటంతో ఆచరణలో పెట్టామని, ప్రాజెక్టు వ్యయాన్ని రూ.320 కోట్లకు తగ్గించినట్లు చంద్రబాబు వివరించారు. ఒక కనెక్షన్‌తో మూడు ప్రయోజనాలు పొందే అవకాశాన్ని ప్రజల ముంగిటకు తెచ్చామని సిఎం చెప్పారు. 10 ఎంబిపిఎస్ కనెక్షన్‌తో వైఫై సదుపాయం, అన్ని టీవీల్లో అన్ని టెలివిజన్ ఛానెల్స్ చూడవచ్చని, అపరిమితంగా మాట్లాడుకునేందుకు ‘ఫ్రీ ఇంటర్‌నెట్ ఫోన్’ సదుపాయం కల్పించినట్లు వివరించారు. ఇంటింటికీ కేవలం రెండు డాలర్లకే కనెక్షన్లు ఇస్తున్నామని, ఇది తాము సాధించామని గర్వంగా చెప్పుకుంటామన్నారు. ప్రస్తుతం పది లక్షల ఇళ్లకు కనెక్షన్ ఇస్తామని, ఒక ఏడాదిలోగా ప్రతి ఇంటికీ కనెక్షన్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అన్ని స్కూళ్లకు ఇంటర్‌నెట్ సదుపాయం కల్పించామని, తరగతి గదుల్లో డిజిటల్ క్లాస్ రూమ్ సదుపాయం కల్పిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. వివిధ శాఖల సమాచారాన్నంతా డ్యాష్ బోర్డ్ ద్వారా తెలుసుకుంటానని చెప్పారు. ప్రజాపంపిణీ వ్యవస్థకు తాము పంపిణీ చేసే రేషన్ సవ్యంగా చేరి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు ఈ-పాస్ యంత్రాలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో ప్రతి పౌరుడికీ ఆధార్ అక్కౌంట్ అనుసంధానం ఉందని, ఈ ఆధార్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించటం సులువైందని చెప్పారు. ఇంటర్‌నెట్ ఫర్ ఆల్, న్యూవిజన్ డెవలప్‌మెంట్ ఫర్ అగ్రికల్చర్, ఎన్విరాన్‌మెంట్, జలవనరుల సంరక్షణ అంశాల్లో ఆధునిక సాంకేతికతో అద్భుతాలు సాధించే అవకాశాలు వచ్చాయని చంద్రబాబు తెలిపారు.

చిత్రం..ఎయిర్ బస్ ప్రతినిధులతో చంద్రబాబు