రాష్ట్రీయం

కిడ్నీ వ్యాధులపై పరిశోధన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ వివరాలు తెలిపారు. రాష్ట్రంలో మరో 19 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా కేంద్రాన్ని కోరినట్టు ఆయన చెప్పారు. ఇదిలాఉండగా మంత్రి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ జోన్ (ఎఎంటీజెట్)- క్వాలిటి కౌన్సిల్ ఆఫ్ ఇండియా మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది. ఈ మేరకు విశాఖలోని మెడికల్ టెక్నాలజీ జోన్ (వైద్య పరికరాల ఉత్పత్తి కేంద్రం)లో తయారయ్యే పరికరాలకు అక్కడే నాణ్యత ప్రమాణాల సర్ట్ఫికేట్‌ను అందిస్తారు. ఢిల్లీలో కామర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో మంత్రి కామినేని, ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ ఒప్పందం వల్ల వైద్య పరికరాల ఉత్పత్తి జరిగే చోటనే నాణ్యత ప్రమాణాల నమోదు జరుగుతుందని వెల్లడించారు. దీనికి సంబంధించి కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి రూ.63 కోట్లు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. విశాఖ జిల్లాలో మాగ్నటిక్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటుకు రూ.45 కోట్లు, గామా రేడియేషన్ కేంద్రం ఏర్పాటుకు రూ.18 కోట్లు మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

చిత్రం..ఢిల్లీలో కామర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో భేటీ అయన మంత్రి కామినేని, ప్రిన్సిపల్ సెక్రటరీ మాలకొండయ్య