రాష్ట్రీయం

మళ్లీ 28కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 20: పుష్కర తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ సి వై సోమయాజులు ఏకసభ్య కమిషన్ విచారణ ఒక అడుగు ముందుకేస్తే. రెండు అడుగులు వెనక్కు వేసినట్టుగా మారింది. కమిషన్‌ను నియమించి దాదాపు ఏడాదిన్నర కాలం పూర్తి కావస్తోంది. ఆరు నెలల కాలంలో విచారణ పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని నిర్ధేశించారు. అధికారులు సకాలంలో సాక్ష్యాధారాలు సమర్పించని కారణంగా కమిషన్ విచారణ కొనసాగుతూనేవుంది. కమిషన్ విచారణ ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ఇప్పటికే నాలుగు సార్లు గడువు పొడిగించారు. ఈ నెల 29వ తేదీతో కమిషన్ గడువు ముగియనుంది. కమిషన్ జస్టిస్ సివై సోమయాజులు శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బిలో విచారణ నిర్వహించారు. అధికార యంత్రాంగం సమర్పించిన సాక్షాల డాక్యుమెంట్లను పరిశీలించిన అనంతరం విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు.
2015 జూలై 14న జరిగిన గోదావరి మహా పుష్కర తొక్కిసలాట ఘటనలో 28 మంది భక్తులు మృతిచెందారు. 51 మంది క్షతగాత్రులయ్యారు. ఇందులో తీవ్ర గాయాలైనవారికి కేంద్ర ప్రభుత్వం రూ.50వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.25వేల చొప్పున ఇచ్చింది. అయితే జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి పంపించిన నివేదికలో తీవ్రంగా గాయపడినవారు ఆరుగురు మాత్రమే ఉన్నారు. తీవ్రంగా గాయపడిన బొమ్మూరు గ్రామానికి చెందిన బిట్రా వెంకట లక్ష్మికి నేటికీ పరిహారం అందకపోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతోంది. తొక్కిసలాట ఘటనలో బాధితురాలికి మానిసిక సమస్య తలెత్తింది. ఎన్నో ఆసుపత్రులకు తిరిగి దాదాపు రూ.రెండున్నర లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. నరాల బలహీనతతో నేటికీ కనిపించినవారందరినీ తనకు న్యాయం చేయాలని కోరుతూ అధికారులు చుట్టూ తిరుగుతోన్నా ఆమెకు నష్టపరిహారం అందలేదు. ఇటీవల రాజమహేంద్రవరం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కూడా కలిసి వినతి పత్రం ఇవ్వగా రూ.25 వేల ఆర్థిక సాయం అందించాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరికి అప్పగించారు. ఇంకా ఆమెకు న్యాయం జరగలేదు. కలెక్టర్ ఇచ్చిన నివేదిక మేరకు మొత్తం 51 మందిలో 31 మందికి మాత్రమే పరిహారం అందించారు. ఇంకా 20 మందికి పరిహారం అందించాల్సి ఉంది. వీరందరికీ ప్రభుత్వం నిర్ధేశించినట్టుగా వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తూ బాధితుల తరపు న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు మానవహక్కుల వేదికలో కేసు కూడా వేశారు.
ఇదిలావుండగా దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా అధికారులు కమిషన్‌కు తగిన సాక్ష్యాధారాల నివేదికలు అందించలేదని, తాము సమర్పించిన ఆధారాలను బట్టి అయినా విచారణ సాగించాలని బాధితుల తరపున న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కావాలనే అధికారులు తగిన సాక్ష్యాలను ప్రవేశపెట్టకుండా కమిషన్ విలువైన కాలాన్ని హరిస్తున్నారన్నారు. మొత్తం 11 అంశాలపై ఆధారాల నివేదిక సమర్పించాలని కమిషన్ ద్వారా కోరితే అధికారులు మాత్రం ఈ విచారణలో కేవలం సమాచార శాఖ రూపొందించిన తొక్కిసలాట విజువల్ సీడీలను మాత్రమే సమర్పించిందని, మిగిలిన సాక్ష్యాలను ఇంకా కమిషన్‌కు సమర్పించలేదని ఆందోళన వ్యక్తంచేశారు. పోలీసులు ఆరు నెలల క్రితమే పోస్టు మార్టమ్ నివేదిక వచ్చిన తర్వాత ఛార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారని, నేటికీ చార్జిషీటు దాఖలు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
విఐపి ఘాట్ ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు పుష్కర ఘాట్‌లో పుష్కరాలను ప్రారంభించాల్సి వచ్చింది.. ముఖ్యమంత్రి వద్ద పుష్కర ఘాట్‌లో దర్శకుడు బోయపాటి ఎందుకు మైక్ పట్టుకుని ఉన్నారనే అంశాలపై అధికారులు అవసరమైన సాక్ష్యాధారాలను కమిషన్‌కు సమర్పించాల్సి ఉందని, నేటికీ ఇవేవీ సమర్పించలేదంటే కావాలనే తొక్కిపెడుతున్నారని ముప్పాళ్ల ఆరోపించారు. శుక్రవారం జరిగిన కమిషన్ విచారణకు ప్రభుత్వ తరపున న్యాయవాది సిహెచ్ ప్రభాకరరావు, బాధితుల తరపున న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, సహాయకుడు కె. శ్రీనివాసరావు, డిఎస్పీ కులశేఖర్, సిఐ రామకోటేశ్వరరావు హాజరయ్యారు.

చిత్రం..పుష్కర తొక్కిసలాటపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ సోమయాజులు