ఆంధ్రప్రదేశ్‌

జలరవాణా వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 21: జాతీయ జల రవాణా ప్రాజెక్టులో కదలిక మొదలైంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ నాలుగో జల మార్గం ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించేందుకు ఈ నెలాఖరున శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే అన్ని రకాల సర్వేలు పూర్తయ్యాయి. జిల్లాలవారీగా సర్వే పూర్తి చేసి అవసరమైన భూమిని గుర్తించామని గోదావరి బేసిన్ చీఫ్ ఇంజనీర్ హరిబాబు తెలియజేశారు.
నాలుగో జాతీయ జల రవాణా ప్రాజెక్టులో భాగంగానే బకింగ్‌హామ్ కాలువ లోతు, వెడల్పు పెంచుతారు. ఇందులో దేశీయ, విదేశీ బహుళ జాతి సంస్థలకు చేతినిండా పని దొరకనుంది. కృష్ణా- గోదావరి నదులను అనుసంధానం చేస్తూ పుదుచ్చేరి వరకు కొనసాగే ఈ కాలువ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టనున్నారు. మొత్తం 1078 కిలోమీటర్ల పొడవున్న ఈ కాలువ ఒక్క ఎపిలోనే 888 కిలోమీటర్లు ఉంది. రాజధాని అమరావతితో ఈ ప్రాజెక్టును అనుసంధానం చేస్తూ జలరవాణా మార్గం పనులు చేపట్టారు. కారు చౌకగా జల రవాణా సౌకర్యం లభించడమే కాకుండా ప్రధానంగా పర్యాటకాభివృద్ధి ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం. 1975 ప్రాంతంలో జల రవాణాకు ఉపకరించిన బకింగ్‌హామ్ కాలువను అనుసంధానం చేస్తూ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టులో భాగంగా ఇరిగేషన్ భూములను సైతం సంరక్షించుకునే అవకాశం దక్కింది. జల వనరుల శాఖకు ఉన్న భూములను ముందుగానే ప్రాజెక్టు కోసం సిద్ధం చేశారు. ఈ నెలాఖరుకల్లా ఫేజ్-1లో అవసరమైన భూసేకరణకు జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రాజధాని అమరావతి వరకు సర్వే పూర్తయింది. ఫిబ్రవరి మొదటి వారంలోగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో అవసరమైన భూసేకరణకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వరకు 50 కిలోమీటర్ల పరిధిలో 600 ఎకరాలు అవసరంగా గుర్తించారు. ధవళేశ్వరం, వేమగిరి, కడియం, మేడపాడు, తొస్సిపూడి, చింతపల్లి, కొవ్వాడ, కాకినాడ మీదుగా ఈ కాలువ ఉంది. ఈ మార్గంలో ఏడు లాకులు, 19 వంతెనలు నిర్మిస్తారు. కాకినాడ కాలువ పరిధిలో 227 హెక్టార్లు, ఏలూరు కాలువ పరిధిలో 524.3 హెక్టార్లు, కొమ్మలూరు కాలువ పరిధిలో 497 హెక్టార్లు, నార్త్ బకింగ్ హామ్ కాలు పరిధిలో 129 హెక్టార్లు, దక్షిణ బకింగ్ హామ్ కాల్వ పరిధిలో 298 హెక్టార్లు, పుదుచ్చేరి పరిధిలో 27 హెక్టార్లు అవసరమని గుర్తించారు. కాకినాడ పుదుచ్చేరి కాల్వ పొడవు 1078 కిలోమీటర్లు, దీనిని పలు విభాగాలుగా నిర్దేశిస్తూ అవసరమైన భూమిని సేకరించి రవాణాకు అనువుగా విస్తరించనున్నారు. ఆ ప్రాజెక్టులో భాగంగా సాగునీటి కాలువలను కూడా ఆధునికీకరించాల్సి ఉంది. దాదాపు 200 వంతెనలు, 48 లాకులను రవాణాకు అనువుగా నిర్మిస్తారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ మధ్య కాలువ పొడవు 139 కిలోమీటర్ల వరకు విస్తరిస్తారు. వజీరాబాద్ విజయవాడ వరకు కృష్ణా నది పరిధిలో 157 కిలో మీటర్ల మేర ఈ కాలువ విస్తరించి ఉంది. భద్రాచలం నుంచి రాజమహేంద్రవరం వరకు గోదావరి నది పరిధిలో ఈ కాలువ 171 కిలోమీటర్ల పరిధిలో ఉంది. గోదావరి నది పరిధిలో ప్రస్తుతం 40 టన్నుల సామర్ధ్యం కలిగిన పడవలు మాత్రమే తిరుగుతున్నాయి. ఈ కాలువల సామర్ధ్యాన్ని 210 టన్నులకు పెంచి నిర్మించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే కాలువల్లో నీటి సామర్ధ్యం పెరిగే అవకాశం ఉన్నందుకు నాలుగో జాతీయ జల రవాణా ప్రాజెక్టుకు పోలవరం ప్రాజెక్టు చాలా కీలకంగా మారనుంది.