రాష్ట్రీయం

చరిత్ర సృష్టించనున్న మిషన్ భగీరథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: మిషన్ భగీరథకు బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1,816 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు తెలంగాణ సాగునీటి సరఫరా కార్పొరేషన్‌తో ఆ బ్యాంకు శనివారం ఒప్పందం కుదుర్చుకుంది. శ్రీశైలం-వికారాబాద్-చేవెళ్ల-తాండూరు-పరిగి, శ్రీశైలం-గుడిపల్లి సెగ్మెంట్ పనుల కోసం ఈ నిధులు వెచ్చిస్తారు. మొత్తం రూ.2270 కోట్లతో చేపడుతున్న ఈ పనులకు రూ.1816 కోట్లను బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణంగా ఇవ్వగా, మిగిలిన 454 కోట్ల రూపాయలను గ్యారంటీ కింద రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది.
మిషన్ భగీరథతో తెలంగాణ చరిత్ర సృష్టిస్తుందని ఆ సంస్థ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఒక భారీ ప్రాజెక్టు పనులు ఇంత శరవేగంగా జరగడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు. ఈ పనుల వేగాన్ని, నాణ్యతను కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ వేదికలపై అభినందిస్తోందన్నారు. మిషన్ భగీరథ పనులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌తో కలిసి ప్రశాంత్‌రెడ్డి శనివారం సమీక్ష జరిపారు. ఇంటెక్‌వెల్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, పైప్‌లైన్ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. భగీరథ పథకంలోని కట్టడాలు అన్నీ దాదాపు పూర్తయ్యే దశకు వచ్చినందున ఇక పైప్‌లైన్ పనులపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. వర్క్ ఏజెన్సీలతో మాట్లాడి సిబ్బందితో పాటు పని గంటలు పెంచాలని, స్థానిక సర్పంచులు, గ్రామస్తుల భాగస్వామ్యంతో ఇంట్రా పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి డిప్యూటీ ఇంజనీర్ ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఇంట్రా పనులను పూర్తి చేయించడం ద్వారా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరారు.