రాష్ట్రీయం

కమల్‌నాథన్ కమిటీ రికార్డులను డాక్యుమెంటేషన్ చేయనున్న కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం, డైరెక్టరేట్ ఉద్యోగులను పెద్ద అవరోధాలు లేకుండా రెండున్నరేళ్ల కాలంలో సాఫీగా విభజించిన కమల్ నాథన్ కమిటీ రికార్డులను డాక్యుమెంటేషన్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్ర హోం శాఖ కోరింది. దేశంలో ఇప్పటివరకూ విభజన జరిగిన రాష్ట్రాల్లో పదేళ్లు గడచినా ఉద్యోగుల పంపకాలు పూర్తి కాని ఉదంతాలు ఉన్నాయి. పైగా కోర్టు లిటిగేషన్లు పెరిగాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 53 వేల మంది ఉద్యోగుల పంపకాలను కమల్‌నాథన్ కమిటీ ఎంతో సహనంతో, ప్రశాంతంగా ముగించింది. కేవలం వెయ్యి మంది ఉద్యోగుల విషయంలో కొన్ని కేసులు ఎదురైనా అవి కూడా త్వరలో పరిష్కారం కానున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, బిహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్రాలు విడిపోయినా, చాలా సంవత్సరాల పాటు ఉద్యోగుల పంపకాల్లో తీవ్రమైన ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగులను కమల్‌నాథన్ కమిటీ సమర్దవంతంగా విభజించడంతో ఆ కమిటీ రికార్డులను సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ (సిఐపిఎస్) పరిధిలో డాక్యుమెంటేషన్ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం 2010లో సిఐపిఎస్ విభాగాన్ని అడ్మినిస్ట్రేటివ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో చేసింది. భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో విభజన జరిగినా ఈ డాక్యుమెంటేషన్ ఉపయోగపడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 151 శాఖల్లో విభజనను కేంద్రం నోటిఫై చేసింది. కేవలం పోలీసు, రెవెన్యూ శాఖల్లో డిఎస్పీ, డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల భర్తీ వద్ద న్యాయపరమైన వివాదాలు ఎదురయ్యాయి.