ఆంధ్రప్రదేశ్‌

తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా.. జాతీయ మహిళా పార్లమెంట్ మహాసభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా, ప్రపంచం నలుదిశలా తెలిసేలా, అమరావతి వేదికగా వచ్చే నెల 10వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జాతీయ మహిళా పార్లమెంటు మహా సభలను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు తెలిపారు. శనివారం ఆయన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్, అసెంబ్లీ ఇన్‌ఛార్జీ కార్యదర్శి కె.సత్యనారాయణరావుతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ‘మహిళలకు ప్రోత్సాహం-ప్రజాస్వామ్య పటిష్టత’ అనే అంశంపై చెప్పారు. కృష్ణా నదీ తీరాన అమరావతిలో నిర్వహించనున్న ఈ మహాసభలకు దేశ, విదేశాల నుంచి 93 మంది మహిళా ఎంపీలు, 400 మంది మహిళా ఎమ్మెల్యేలు, 2500 కళాశాలల నుంచి సుమారు 10 వేల మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. ఈ మహాసభలకు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లను, మహిళా ప్రముఖులను ఆహ్వానించామని, అంతర్జాతీయ స్థాయి సదస్సు అయినప్పటికీ స్థానికతకు ప్రాధాన్యం ఇచ్చామని, ఆహ్వానితుల్లో, ప్రసంగించే వారిలో ఎక్కువ మంది తెలుగువారు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కోడెల వివరించారు.
మహిళా సాధికారిత-రాజకీయ సవాళ్లు, వ్యక్తిత్వ నిర్మాణం-్భవిష్యత్తు దార్శనికత, గురు శిష్యుల సంబంధాల పెంపు, సంస్కృతీ, సంప్రదాయాల కొనసాగింపులో మహిళల పాత్ర, మహిళల స్థితి-నిర్ణయాత్మక శక్తి, మీకు మీరే సాటి, మహిళా ఆరోగ్యం వంటి అంశాలపై 50 మంది చొప్పున చర్చించేందుకు వీలుగా ఈ మహాసభల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చట్టసభల్లో మహిళ ప్రాతినిథ్యంతో పాటు అన్ని విషయాల్లోనూ వారికి తగిన ప్రాధాన్యం కల్పించడమే ధ్యేయంగా ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలు ఏర్పాటుచేసి, మహిళా సాధికారతపై ‘అమరావతి డిక్లరేషన్’ను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుని రావాలన్న లక్ష్యంతో సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై 18 కమిటీలను నియమించినట్లు ఆయన చెప్పారు. అసెంబ్లీ సమావేశాలను, కమిటీల సమీక్షా సమావేశాలను ఇకమీదట అమరావతిలోనే నిర్వహించనున్నట్లు స్పీకర్ కోడెల తెలిపారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు అన్ని పార్టీలూ ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.

భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టుకు
అనుమతులపై
ఐదు రోజుల్లో నిర్ణయం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 21: కొత్తగూడెం జిల్లా మణుగూరులో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్ధ నిర్మించతలపెట్టిన 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతుల జారీపై మరో ఐదురోజుల్లో కేంద్రం నుంచి నిర్ణయం వెలువడనుంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశమై భద్రాద్రి అనుమతుల జారీ అంశంపై పరిశీలన జరిపింది. తెలంగాణ ఇందన శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా, జెన్కో సిఎండి డి.ప్రభాకరరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.