ఆంధ్రప్రదేశ్‌

తమిళులే మనకు స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జనవరి 21: ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడానికి తమిళులను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు ప్రజలందరూ ఐక్యం కావాలని పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, తమిళనాడు రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సంప్రదాయంగా నిర్వహించే జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం ప్రకటించడంతో అక్కడి రాజకీయ పార్టీలు, సినిమా రంగం, ప్రజలు ఐకమత్యంగా పోరాటం చేసి కేంద్రపై ఒత్తిడి చేసి కేవలం మూడు రోజుల్లో ఆర్డినెన్స్ తెచ్చుకోగలిగారన్నారు. ఈ జల్లికట్టు వల్ల ప్రజలకు ఎలాంటి లాభం లేదన్నారు. అయితే ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేస్తే నేటికీ కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు చేస్తోందన్నారు. ఇప్పటికే ప్రజాబ్యాలెట్ ద్వారా అభిప్రాయాలు సేకరించగా 99 శాతం మంది ప్రత్యేకహోదా ఎంతో అవసరమని ఓటింగ్ చేశారన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు తమిళులను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. వీరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం వహించాలన్నారు. హోదా సాధిస్తే రాష్ట్రానికి విరివిగా నిధులు, పరిశ్రమలు వస్తాయని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఈ విషయంలో తెలుగు ప్రజలందరూ ఐక్యంగా కలసి కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి సొరంగాల నాగరాజు, మంజునాథ్, నాగేంద్ర పాల్గొన్నారు.

విలేఖరులతో మాట్లాడుతున్న పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి