రాష్ట్రీయం

ఏడుగురు జిల్లా జడ్జీల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: ఉమ్మడి హైకోర్టు పరిథిలో ఏడుగురు జిల్లా జడ్జీలు బదిలీ అయ్యారు. సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా పి. సుధ, నాంపల్లి కోర్టు ఎంఎస్‌జెగా జి. రాధారాణి, సిటీ స్మాల్ కాజెస్ చీఫ్ జడ్జిగా జి. ఉదయగౌడ్, తెలంగాణ వ్యాట్ అప్పీల్లేట్ ట్రైబ్యునల్ చైర్మన్‌గా ఎంవి రమణ నాయుడు, ఎపి జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా పి. సుమలత, గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా హరిహరనాథ శర్మ, గుంటూరు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా ఎన్. నర్సింగ రావు నియమితులయ్యారు.
ఫిబ్రవరి నుంచి వేసవి ప్రత్యేక రైళ్లు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 21: వచ్చే వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-విజయవాడ, నాందేడ్-తిరుపతి, కాచిగూడ-టాటానగర్, హౌరా-ఎర్నాకుళం మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-విజయవాడ మధ్య సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైలు ఫిబ్రవరి 5, 12, 19, 26, మార్చిలో 5, 12, 19, 26, ఏప్రిల్‌లో 2, 9, 16, 23, 30, మే నెలలో 7, 14, 21, 28, జూన్ నెలలో 4, 11, 18, 25 తేదీల్లో నడుపుతారు. ఈ రైలు ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి విజయవాడకు ఉదయం 10.45కు చేరుకుంటుంది. విజయవాడ-సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు అదే తేదీల్లో నడుపుతారు. నాందేడ్-తిరుపతి 42 సర్వీసులు, కాచిగూడ-టాటానగర్ 34 సర్వీసులు, హౌరా ఎర్నాకులం 42 సర్వీసులను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.