రాష్ట్రీయం

డిజిటల్ లావాదేవీలపై రేపు మధ్యంతర నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 22: పెద్దనోట్ల రద్దు అనంతర పరిస్థితులు, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీ ఈ నెల 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మధ్యంతర నివేదికను సమర్పించనుంది. ఈ నేపధ్యంలో వివిధ అంశాలపై ఆదివారం సిఎం చంద్రబాబు ఆర్థిక, ఇతర శాఖల ఉన్నతాధికారులు, బ్యాంకర్లతో సమీక్షించారు. పెద్దనోట్ల రద్దు అనంతరం నగదు రహిత చెల్లింపుల విధానం ఏ మేరకు పెరిగింది? ప్రజలు ఎంతవరకు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారనే దానిపై మధ్యంతర నివేదికను కమిటీ ఆధ్వర్యంలో ప్రధానికి సమర్పించనున్నారన్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి నివేదికలో పొందుపర్చాల్సిన ఆవశ్యకత ఉందని, అందుకనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డిజిటల్ లావాదేవీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలు ఇప్పటివరకూ ఏ విధంగా ఉన్నాయనే అంశాలు నివేదికలో పొందుపర్చడంతో పాటు వీటిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వపరంగా తీసుకోవల్సిన మరిన్ని చర్యలు, సూచనలు నివేదిక రూపంలో ప్రధానికి అందించేందుకు సిద్ధం చేయాలని చెప్పారు.
ప్రస్తుతం 42 శాతం డిజిటల్ లావాదేవీలతో మన రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని రానున్న రోజుల్లో దీన్ని 60 శాతానికి పైగా తీసుకువెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకుగాను అవసరమైన బయోమెట్రిక్ పరికరాలను పూర్తిస్థాయిలో అందుబాటులో వుంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఐటి శాఖ కార్యదర్శి విజయానంద్‌ను సిఎం ఆదేశించారు.