రాష్ట్రీయం

స్మార్ట్‌సిటీకి టెండరింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 22: కాకినాడ నగరాన్ని స్మార్ట్‌సిటీగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆరంభంలోనే ఇక్కడి అధికారులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. కాకినాడ స్మార్ట్‌సిటీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నప్పటికీ సిటీ నిర్మాణానికి ఎంపిక చేయాల్సిన కన్సల్టెన్సీ ఎంపిక నుండే స్థానిక అధికారుల చేతివాటం మొదలయ్యింది. ఈ ప్రాజెక్టు విలువ 2వేల కోట్ల రూపాయలు కాగా పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంగా వెయ్యి కోట్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 500 కోట్లు.. మొత్తం 2వేల కోట్లను కాకినాడ నగరాభివృద్ధికి వెచ్చించనున్నారు. దీని పర్యవేక్షణ నిమిత్తం ప్రాజెక్ట్ మేనేజిమెంట్ కన్సల్టెన్సీల (పిఎంసి)ను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి పర్యవేక్షణాధికారిగా కాకినాడ నగర పాలక సంస్థ కమీషనర్ వ్యవహరిస్తుండగా వివిధ ప్రభుత్వ శాఖల నుండి మరో 9 మందితో స్మార్ట్‌సిటీ టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీని ఏర్పాటుచేశారు. స్మార్ట్‌సిటీ గైడ్‌లైన్స్ ప్రకారం కనె్సల్టెన్సీని ఎంపికచేస్తారు. ఎంపికైన కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో స్మార్ట్‌సిటీకి ప్రణాళిక రచన మొదలు నగరాభివృద్ధి, నిర్దేశించిన ప్రకారం నిధుల కేటాయింపు, ఆయా అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ తదితరాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో కన్సల్టెన్సీ ఎంపికకు మొదట్లో కాకినాడ కార్పొరేషన్ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. సుమారు 7 కంపెనీలు టెండర్ ప్రక్రియలో పాల్గొన్నాయి. అందులో ఆర్‌వి అసోసియేట్స్, వాడియా టెక్నాలజీస్, ఎపిటీసా కంపెనీల మధ్య ప్రధానంగా పోటీ నడిచింది. మిగిలిన 4 కంపెనీలు వివిధ సాంకేతిక కారణాలతో వెనక్కివెళ్ళాయి. కన్సల్టెన్సీ ఎంపికలో టీం లీడరు పని నైపుణ్యం, విద్యార్హత ఆధారంగా సాంకేతికపరమైన మార్కులు లభిస్తాయి. టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ టెండర్లను పరిశీలించిన పిమ్మట ఆర్‌వి అసోసియేట్స్‌కి హెచ్-1 స్థాయి ఇచ్చింది. హెచ్-2 స్థాయిని వాడియా కంపెనీకి, హెచ్-3 స్థాయి ఎపిటిసా కంపెనీకి లభించాయి. అయితే ఈ వ్యవహారం అంతా తప్పుడు పద్ధతిలో జరిగిందంటూ హెచ్-2 స్థాయి వచ్చిన వాడియా టెక్నాలజీ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. హెచ్-1 పొజిషన్‌లో వచ్చిన టీం లీడర్ తన కరిక్యులమ్‌ను తప్పుడు విధానంలో సృష్టించారంటూ 2016 ఆగస్టు 22న హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఈ కేసును పూర్తిగా పరిశీలించి, డబ్ల్యుపి నంబర్ 27840/2016 ఆర్డర్ ద్వారా స్టే ఇచ్చింది.
అయితే కాకినాడ కార్పొరేషన్ అధికారులు హైకోర్టులో కౌంటర్‌కు వెళ్ళగా చుక్కెదురయ్యింది. మళ్ళీ అధికారులు అడ్వకేట్ జనరల్‌ను ఆశ్రయించారు. సాధారణంగా ఏ ప్రభుత్వ శాఖ అధికారులైనా దానికి సంబంధించిన స్టాండింగ్ కౌనె్సల్ న్యాయవాదులను మాత్రమే ఆశ్రయించాల్సి ఉండగా, అందుకు భిన్నంగా హెచ్-1 పొజిషన్ తరపున వకాల్తా వేసిన న్యాయవాదికి అధికారులు మొత్తం పెత్తనాన్ని కట్టబెట్టడం చర్చనీయాంశమయ్యింది. ఈ విధంగా లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కావడానికి అధికారులు కారణమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసును హైకోర్టు నిశితంగా పరిశీలించి, మోసానికి పాల్పడిన ఆర్‌వి అసోసియేట్స్‌పైన, వారి టీం లీడరుపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇది మింగుడుపడని కార్పొరేషన్ అధికారులు తమ తప్పులను బయటపెట్టారన్న అక్కసుతో హెచ్-2 స్థాయి దక్కించుకున్న వాడియా కంపెనీ వారిని కూడా అనర్హులుగా ప్రకటించడం ఆయా వర్గాల్లో కలకలం రేపింది.
హెచ్-1 స్థాయి వచ్చిన ఆర్‌వి అసోసియేట్స్ రూ.27 కోట్లకు టెండర్ కోట్ చేయగా హెచ్-2 స్థాయి వచ్చిన వాడియా రూ.18 కోట్లకు టెండర్ కోట్ చేయగా హెచ్-3 స్థాయి వచ్చిన ఎపిటిసా రూ.35 కోట్లకు కోట్ చేసింది. అయితే హెచ్-1స్థాయి వచ్చిన ఆర్‌వి అసోసియేట్స్‌ను కోర్టు డిస్‌క్వాలిఫై చేయడంతో మిగిలిన రెండు కంపెనీల కోట్‌ను ఆధారం చేసుకుని కన్సల్టెన్సీని ఎంపిక చేయాల్సి ఉంది. ఆ విధంగా రూ.18 కోట్లకే కోట్ చేసిన వాడియా సంస్థను ఎంపిక చేయాల్సి ఉండగా, అధిక మొత్తంలో కోట్ చేసిన ఎపిటిసా కంపెనీని కన్సల్టెన్సీగా ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తుండటానికి వెనుక భారీగా సొమ్ములు చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా సుమారు రూ.9 కోట్ల మేరకు ప్రజాధనం దుర్వినియోగం అయ్యే దుస్థితి దాపురించిందని సాక్షాత్తూ నగర పాలక సంస్థకు చెందిన వర్గాలు కోడై కూస్తున్నాయి. హైకోర్టు స్టే ఉండగా గుట్టుచప్పుడు కాకుండా అధికారులు రహస్యంగా రీటెండర్ వేసి అధిక మొత్తానికి కోట్ చేసిన కంపెనీకి నిర్వహణ బాధ్యతలను అప్పగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని, ఇది కోర్టు ధిక్కార నేరం క్రిందకు వస్తుందని, రహస్యంగా జరిగిన రీటెండర్ విధానాన్ని రద్దు చేసి, ఐఎఎస్ అధికారిని స్మార్ట్‌సిటీకి పర్యవేక్షణాధికారిగా నియమించి, కార్పొరేషన్‌లో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని సంబంధిత వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.