రాష్ట్రీయం

విద్రోహ చర్యే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 22: హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఘోర దుర్ఘటన వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది విద్రోహుల కుట్ర అని నిపుణులు అనుమానిస్తున్నారు. కూనేరు రైల్వే కేబిన్ వద్ద జరిగిన సంఘటనను పరిశీలిస్తే.. రైలు పట్టాలకు ఇరువైపుల సమాంతరంగా టంగ్ బ్రేక్ రావడాన్ని బట్టి విద్రోహచర్య అని భావిస్తున్నారు. రైలు స్పీడులో ఉన్నప్పుడు బ్రేకులు వేసినా రెండు పట్టా కమ్ములపై సమాంతరంగా విరగడం జరగదని చెబుతున్నారు. సాధారణంగా రైలు వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు బ్రేక్ వేసినా ఆ రకంగా పట్టాలు విరగడం జరగదని రైల్వే సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. పట్టాల సంకోచ వ్యాకోచాలు ఉన్నప్పటికీ గొడ్డలితో పట్టాలపై కోసినట్టు కన్పిస్తుందని, ఇది విద్రోహుల చర్య అని కొందరు చెబుతున్నారు. కాగా, దంతేవాడ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఎవరైనా దుశ్చర్యకు పాల్పడి ఉంటారా అన్న అనుమానాన్ని మరి కొందరు వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయమై డిఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ వద్ద ప్రస్తావించగా రైలు ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయన్నారు. అయితే సాంకేతిక లోపమా? మానవ తప్పిదమా అన్నది విచారణలో నిర్థారణ కావాల్సి ఉందన్నారు. ఈ ప్రమాదంపై రైల్వే శాఖతోగాకుండా పౌరవిమానయాన శాఖకు చెందిన ఇన్విస్టిగేషన్ బృందంతో దర్యాప్తు చేపట్టాలని రైల్వే అధికారులు కోరారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కిమిడి మృణాళిని వెల్లడించారు.

చిత్రం..బోగీల్లో ఇరుక్కుపోయన మృతదేహాలను వెలికి తీస్తున్న సహాయ బృందాలు