రాష్ట్రీయం

సిస్టర్ సిటీ ఒప్పందాలకు సహకరం అందిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22:జపాన్‌లోని ఒకటి రెండు నగరాలతో సిస్టర్ సిటీ ఒప్పందాన్ని చేసుకునేందుకు సహకరిస్తామని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావుకు అక్కడి భారత రాయబారి సుజన్ చినాయ్ తెలిపారు. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించేందుకు జపాన్‌లో పర్యటిస్తున్న కెటిఆర్ ఆదివారం సాయంత్రం రాయబారి సుజన్ చినాయ్‌ను కలిశారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు రాబట్టేందుకు వీలుగా రూపొందించిన పాలసీలను, చర్యలను మంత్రి వివరించారు. టిఎస్‌ఐపాస్ విధానం ద్వారా సత్వరం అనుమతులు ఇస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా చిన్న తరహా పరిశ్రమలు, పెట్టుబడులపై దృష్టి సారించాలని సుజన్ చినాయ్ సూచించారు. జపాన్ కంపెనీలకు సిబ్బందిని సమకూర్చేందుకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని కెటిఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

చిత్రం..జపాన్‌లోని భారత రాయబారికి జ్ఞాపికను అందజేస్తున్న కెటిఆర్, ఐటి కార్యదర్శి జయేష్ రంజన్