రాష్ట్రీయం

సిఆర్‌పిఎఫ్‌లో ఖాళీల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: సెంట్రల్ పోలీస్ రిజర్వ్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్)లో 2,945 మంది పోలీస్ ఉద్యోగ ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పదోతరగతి ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. టెక్నికల్ విభాగాల్లో అదనపు అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. సిఆర్‌పిఎఫ్, ఎస్‌ఎస్‌సితోపాటు హెవీ వెహికిల్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులకు సంబంధిత ఉద్యోగాల్లో అవకాశం ఉంటుందని బోర్డు తెలిపింది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ రిక్రూట్‌మెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు 137 పోస్టులుండగా, తెలంగాణకు 100 ఖాళీలు ఉన్నట్టు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 31 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, పూర్తి వివరాలు సిఆర్‌పిఎఫ్.ఎన్‌ఐసి.ఇన్‌లో కనుగొనవచ్చని బోర్డు తెలిపింది. మొత్తం 2,945 ఖాళీల్లో డ్రైవర్లు, టెక్నికల్ వారే అర్హులని ఈ దరఖాస్తులు మార్చి ఒకటో తేదీ వరకు చేసుకోవచ్చని రిక్రూట్‌మెంట్ బోర్డు పేర్కొంది.