రాష్ట్రీయం

కలెక్షన్లు, అవార్డులు రెండూ అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్), జనవరి 22: ఇటీవలి కాలంలో తెలుగులో ప్రజారంజకమైన మంచి చిత్రాలు రాకపోవడం వల్లనే జాతీయ స్థాయిలో అవార్డులు సాధించలేకపోతున్నామని ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. తమిళం, మలయాళం, కన్నడంలో మంచి చిత్రాలు వస్తున్నాయని, అయితే పెట్టుబడులు కూడా రావడం లేదని అన్నారు. ప్రజలు ఆశించే మంచి చిత్రాలు రావడానికి సినీ అభిమానులు తమ అభిమాన నటులపై ఒత్తిడి తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు. మహమ్మద్ రఫీ గానం తనను ప్రభావితం చేసిందని, చలనచిత్ర నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, ఆరు జాతీయ పురస్కారాలందుకున్న పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ జిల్లా 3020 ఆయనకు జీవిత సాఫల్య పురస్కారానిచ్చి గౌరవించింది. ఆదివారం ఉదయం మహాత్మాగాంధీ రోడ్డులోని ఒక హోటల్‌లో జరిగిన ఈ పురస్కార ప్రదానంలో పలువురు అభిమానులు ఆయనను ప్రశ్నల వర్షంలో ముంచెత్తారు. ఇప్పుడు వస్తున్న సినిమాలు చూడదగినవిగా లేవని, పాటలు వినదగ్గవిగా లేవని, ప్రముఖ నటులు కూడా వాణిజ్యపరమైన చిత్రాలవైపే మొగ్గుచూపుతున్నారని అన్నారు. దీనిపై ఎస్పీ తనదైన బాణిలో స్పందిస్తూ మంచి చిత్రాలకు కలెక్షన్లు ఉండవు, అలాంటి సినిమాలు నిర్మాతలు తీయరు... నటులు కూడా కలెక్షన్ చిత్రాలవైపు మొగ్గు చూపుతున్నారు... ఇలావుంటే అవార్డులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. భారీ బడ్జెట్ చిత్రాల విడుదల సమయంలో థియేటర్లన్నీ ముందుస్తుగా బుక్ అవుతుంటే మంచి చిత్రాలు ఎక్కడ ఎలా ప్రదర్శితం కాగలవని ప్రశ్నించారు. ఎందరో మహానుభావులు, కారణజన్ములు తమ గానంతో చలనచిత్ర సీమను సుసంపన్నం చేశారన్నారు. ఇటువంటి ఏ పురస్కారాలైనా, అవార్డులు అయినా తీసుకుంటున్నానంటే దానికి కేవలం తాను 40శాతం మాత్రమే అర్హుడునని, పాట రాసిన వారికి, సంగీత సమర్పణ చేసిన వారికి, ఆర్కెస్ట్రా వారికి, సన్నివేశానికి తగిన విధంగా చిత్రీకరించే వారందరికీ దీనిలో భాగముంటుందని తెలిపారు.

చిత్రం..ఎస్‌పి బాలుకు జీవిత సాఫల్య పురస్కారం అందజేస్తున్న దృశ్యం