రాష్ట్రీయం

డబుల్ పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: తెరాస సర్కారుకు కీలక పథకమైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం ఇక వేగాన్ని పుంజుకోనుంది. మార్గదర్శకాలు, నిర్మాణ వ్యయం వంటి పలు సమస్యలతో ఇంతకాలం నత్తనడక నడిచిన ఈ ప్రాజెక్టులో వేగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలోనే 2.6 లక్షల ఇళ్లను నిర్మించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ వ్యయం తగ్గేందుకు కేబినెట్ సబ్ కమిటీ పలు రాయితీలు ప్రకటించింది. సీనరీస్ తగ్గింపుతో ఉచితంగా ఇసుక, కంపెనీ ధరకే సిమెంట్ (బస్తా 235 రూపాయల చొప్పున) ఇవ్వాలని నిర్ణయించారు. వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణంలో రాయితీ వంటి పలు వెసులుబాట్లు కల్పించడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గినట్టు మంత్రివర్గ ఉప సంఘం తెలిపింది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచేందుకు గతంలోనే సిఎం కెసిఆర్ కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రులు టి హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డిలు సోమవారం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఉచితంగా ఇసుక ఇవ్వడం, సిమెంట్ ధర తగ్గించడం వల్ల ఒక్కో ఇంటి వ్యయం దాదాపు రూ. 50వేల వరకు తగ్గుతుందని అంచనా వేశారు. నిధుల విడుదలలో జాప్యం తలెత్తకుండా సంబంధిత పూర్తి అధికారాలు జిల్లా కలెక్టర్లకే ఇవ్వాలని నిర్ణయించారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసేందుకు ప్రభుత్వం త్వరలోనే అదనంగా మరిన్ని మార్గదర్శకాలను జారీ చేయనుంది. ఈ ఏడాదిలోపే 2.6 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. వచ్చే నెల ఫిబ్రవరి నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యేలా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపించాలని మంత్రివర్గ ఉప సంఘం సూచించింది.
మంత్రివర్గ ఉప సంఘం సమావేశం తరువాత గృహ నిర్మాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నట్టు చెప్పారు. ప్రభుత్వపరంగా పలు రాయితీలు కల్పించి ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నామన్నారు. ఇసుక లభించనిచోట పక్క జిల్లాల నుంచి ఇసుకను సరఫరా చేసేలా నిబంధనలను సరళతరం చేయాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. సిమెంట్ ఇటుకల నిర్మాణానికి ప్లయింగ్ యాష్ (బూడిద) వంద కిలోమీటర్ల వరకు ఉచితంగా తరలించేందుకు ఎన్‌టిపిసి అంగీకరించిందని, దీనివల్ల నిర్మాణ వ్యయం తగ్గే అవకాశం ఉందని ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పురోగతిని పర్యవేక్షించేందుకు నోడల్ ఆఫీసర్‌ను నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు మంత్రి తెలిపారు. మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించిన అంశాలను సిఎం దృష్టికి తీసుకు వెళ్లనున్నట్టు చెప్పారు. సచివాలయంలోని ఆర్థిక శాఖ సమావేశ మందిరంలో జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, హౌజింగ్ ప్రత్యేక కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, హౌజింగ్ కార్పొరేషన్ సిఇ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల మార్గదర్శకాలపై సమీక్షిస్తున్న కేబినెట్ సబ్ కమిటీ