రాష్ట్రీయం

‘కంది’కి మద్దతు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కందులు పండించిన రైతులు నిరాశ, నిస్పృహలకు గురికావద్దని, కనీస మద్దతు ధరకే వీటిని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామని రాష్ట్ర మార్కెటింగ్ మంత్రి టి. హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. కందులకు మద్దతు ధర, కొనుగోలుకు సంబంధించి తాజాగా నెలకొన్న పరిస్థితిపై సోమవారం ఆయన అధికారులతో ఇక్కడ సమీక్షించారు. సమీక్షా సమావేశంలో వెల్లడైన వివరాలు ఇలా ఉన్నాయి. రైతులకు మద్దతుధర ఇచ్చేందుకు వీలుగా 80 కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఇప్పటికే 68 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కల్వకుర్తి, కొల్లాపూర్‌లలో వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. కేంద్రప్రభుత్వం నేతృత్వంలోని ఎఫ్‌సిఐ, నాఫెడ్‌లతోపాటు, రాష్ట్రప్రభుత్వం నేతృత్వంలోని మార్క్‌ఫెడ్, హాకా, డిసిఎంఎస్‌లు సంయుక్తంగా వీటిని ఏర్పాటు చేశారు. దళారీవ్యవస్థను అరికట్టేందుకు వీలుగా కందులను మార్కెట్‌కు తెచ్చేరైతులు తమ పట్టాదారుపాస్‌పుస్తకాలను వెంట తీసుకుని రావాలని సూచించారు. ఇప్పటికే రాష్టవ్య్రాప్తంగా 20,720 మంది రైతుల నుండి 2,17,628 క్వింటాళ్ల కందులను కొనుగోలు చేసి, రైతులకు 50 కోట్ల రూపాయలు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని కూడా వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. కందుల కొనుగోలులో ఏవైనా ఇబ్బందులు, సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చేసేందుకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైతులు తమ ఫిర్యాదులను 040-2326 6091 ఫోన్‌నెంబర్‌కు తెలియచేయాల్సి ఉంటుంది. కందుల కొనుగోలుకు సంబంధించి మార్కెటింగ్ డైరెక్టర్ ప్రతి సోమవారం సమావేశం నిర్వహించి,పరిస్థితి సమీక్షించాలని నిర్ణయించారు. కందుల రెగ్యులేషన్ జరుగుతున్న మార్కెట్లో ప్రభుత్వ ఏజన్సీలు కొనుగోలు చేసిన తర్వాత ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తే కనీస మద్దతు ధర చెల్లించాలని ఆదేశించారు. ఏవైనా వివాదాలు వస్తే పరిష్కరించేందుకు ఒక కమిటీని వేయాలని నిర్ణయించారు. కందులను శుభ్రపరిచే యంత్రాలను ఏర్పాటు చేయాలని, 12 శాతం తేమ మించకుండా కందులను మార్కెట్లకు తీసుకువచ్చేలా రైతుల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించారు. రైతులు కందులను మార్కెట్‌కు తీసుకువచ్చి కుప్పపోసేంతవరకే ఖర్చును భరించాల్సి ఉంటుందని, ఆ తర్వాత తూకం, హమాలీ తదితర ఖర్చులన్నీ ప్రభుత్వ ఏజన్సీలే భరిస్తాయని స్పష్టం చేశారు. ఈ విషయాలన్నీ రైతులకు తెలియచేయాలని నిర్ణయించారు. రైతులు కందులను మార్కెట్లోకి తీసుకురాగానే ఇన్‌వాయిస్‌బిల్లు తయారు చేసి డబ్బు అందించాలని ఆదేశించారు. రైతులు పడిగాపులు పడకుండా చూడాలని నిర్ణయించారు. రైతుల్లో నమ్మకం కలిగించేందుకు ఉన్నతాధికారులు నిరంతరం మార్కెట్‌యార్డుల్లోని సిబ్బందితో చర్చిస్తూ ఉండాలని నిర్ణయించారు.
ఎగుమతిపై ఆంక్షలు ఎత్తివేయాలి
దేశం నుండి కందులను ఎగుమతి చేసేందుకు గతంలో రూపొందించిన ఆంక్షలను ఎత్తివేయాలని కేంద్రానికి లేఖరాశారు. ఈ అంశంపై కేంద్ర వాణిజ్యమంత్రి నిర్మలాసీతారామన్‌తో చర్చించాలని నిర్ణయించరు. అదే సమయంలో మయన్మార్, మోజాంబిక్ దేశాల నుండి కందులు దిగుమతి కాకుండా చర్యలు చేపట్టాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు.