రాష్ట్రీయం

కత్తిమీద సాము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 24: ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖ మరో సవాల్‌ను ఎదుర్కోనుంది. రాష్ట్రంలో ఆందోళనల పర్వం ఒకవైపు, రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు మరోవైపు. ఈ నేపథ్యంలో భద్రత, బందోబస్తు కత్తిమీద సాము లా మారాయి. ఉత్కంఠ పరిస్ధితులు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున పోలీసుశాఖ అప్రమత్తమైంది. ఈనెల 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను ఏపి పోలీసు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అదేరోజు విజయవాడ, తిరుపతి, విశాఖ పట్టణాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండులో జనం రోడ్డుపైకి రానున్నారు. ఇదే క్రమంలో కాపులను బిసిల్లో చేర్చాలంటూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన నిరాహారా దీక్ష పాదయాత్ర తాత్కాలికంగా విరమించినా.. పోలీసులు మాత్రం అటెన్షన్‌గానే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇక రాష్ట్రంలో సోషల్ మీడియా ప్రచారం ఇప్పటికే యువతను వెర్రెత్తిస్తోంది. దీంతో రిపబ్లిక్ డే రోజున రాష్ట్రంలో పరిస్ధితిపై పోలీసుశాఖ అంచనాకు వచ్చింది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉండవచ్చనే అనుమానంతో హైటెన్షన్ నెలకొంది. రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్దయెత్తున విద్యార్ధిలోకం హాజరుకానుంది. ప్రభుత్వ శాఖల శకటాలు కొలువుతీరనున్నాయి. పోలీసు బెటాలియన్ దళాలు పరేడ్ నిర్వహించనున్నాయి. అయితే గణతంత్ర వేడుకల నేపధ్యంలో నిఘా వర్గాల హెచ్చరికల నేపధ్యంలో ఉగ్రముప్పు పొంచి ఉండే అవకాశం లేకపోలేదు. దీంతో ఓ వైపు వేడుకలు విజయవంతంగా నిర్వహించడంతోపాటు ఉగ్ర కదలికలను కనిపెట్టే పనిలో పోలీసు, ఇంటిలిజెన్స్ వర్గాలు నిమగ్నమయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మద్దతు ప్రకటించిన క్రమంలో సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. పొరుగు రాష్ట్రం తమిళనాడులో ‘జల్లికట్టు’ ఆందోళన అనుభవాన్ని బేరీజు వేసుకుంటున్న పోలీసుశాఖ ప్రత్యేక హోదా సోషల్ మీడియా ప్రచారోద్యమంపై దృష్టి సారించింది. అగంతకుల ప్రచారంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పోలీసుశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రత్యేక హోదా పేరుతో నిర్వాహకులు లేకుండా అనధికారికంగా రాష్ట్రంలో 26వ తేదీన సమావేశాలు నిర్వహించడం ద్వారా హింస చోటు చేసుకునే పరిస్ధితి ఉందనేది పోలీసులకున్న అంచనా. దీంతో బలగాలు రాష్టవ్య్రాప్తంగా అప్రమత్తమై 26వ తేదీన సోషల్ మీడియా సమావేశాలను అడ్డుకునేందుకు కార్యాచరణతో సిద్ధమవుతున్నాయి. అనుమతి లేని సమావేశాలను ఉపేక్షించబోమన్న పోలీసు హెచ్చరికలు సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ పబ్లిక్ టాక్. అయినా శాంతి భద్రతల దృష్ట్యా తప్పదని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో ముద్రగడ పద్మనాభం పాదయాత్రతో అప్రమత్తమైన యంత్రాంగం ఆయన్ను ఇంటినుంచి బయటకు రాకుండా నిలువరించడంలో సక్సెస్ అయినా.. అది తాత్కాలికమేనని తెలుస్తోంది. అనుకోకుండా 25, 26 తేదీల్లో ముద్రగడ బయటకు వస్తే పోలీసుశాఖకు ఊపిరిసలపని పరిస్ధితనే చెప్పాలి. ఏది ఏమైనా 26న రాష్ట్రంలో ఏ పరిస్ధితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ పోలీసుశాఖ ధీమా వ్యక్తం చేస్తోంది.