రాష్ట్రీయం

ముద్రగడ గృహ నిర్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 24: గృహ నిర్బంధాలు, అరెస్టులకు భయపడేది లేదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. రాష్ట్రంలో అందరూ ఆందోళనలు చేయవచ్చు కాని, కాపులు మాత్రం చేయకూడదా? అని ప్రశ్నించారు. కాపులే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను దగ్ధం చేశారని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి దమ్ముంటే తమను అరెస్టుచేసి జైలులో పెట్టాలని సవాల్ విసిరారు. తనను, తన కుటుంబాన్ని చంపినా ఫర్వాలేదని, కాపులకు రిజర్వేషన్ల సాధనే తన లక్ష్యమని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రావులపాలెంనుంచి పాదయాత్ర చేసేందుకు బయల్దేరిన ముద్రగడను ఇంటి బయటే పోలీసు అధికారులు అడ్డుకుని, గృహ నిర్బంధం చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. కోనసీమ, ఇతర జిల్లాల్లో కాపులు ఎక్కువగా ఉన్నచోట గృహ నిర్బంధాలు చేయడం, నేతలను బెరించేందుకు పోలీసులు కవాతు చేయటం చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. పాదయాత్ర నేపథ్యంలో గృహ నిర్బంధానికి గురైన కాపునేతలందరం కలసి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని చెప్పారు. తమిళనాడులో సంచలనం సృష్టించిన జల్లికట్టు వ్యవహారం నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో వైఫల్యం చెందడంపై ఎవరెన్ని మాటలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిగ్గు లేదని ముద్రగడ వ్యాఖ్యానించారు. అయితే కాపుల హక్కుల కోసం అడిగితే మాత్రం ఆయనకు ఎక్కడలేని కోపం వస్తోందని విమర్శించారు. కాపులను అసభ్య పదజాలంతో తిట్టిస్తున్నారని, ఇది చంద్రబాబుకే చెల్లించదన్నారు. కాపులను బిసిలుగా గుర్తించేందుకు నియమించిన మంజునాథ కమిషన్ పరిస్థితి అతీగతీ లేకుండా తయారయ్యిందని, ఇటువంటి సర్వేలను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కేవలం ఒక్క రోజులో పూర్తిచేశారన్నారు. గతేడాది 14రోజుల పాటు ఆసుపత్రి అనే జైలులో తనను నిర్బంధించారని, ఇప్పుడు మళ్ళీ అదే విధంగా అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయండి అని సవాల్ చేశారు.

చిత్రం..ఇంటి గేటువద్ద కారును నిలిపివేసిన పోలీసు బలగాలు