రాష్ట్రీయం

యాదాద్రికి ఎంఎంటిఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, జనవరి 24: ఒకవైపు యాదాద్రి, మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎంఎంటిఎస్ కనెక్టివిటీకి చర్యలు ప్రారంభించినట్టు దక్షిణ మధ్య రైల్వే జిఎం పికె యాదవ్ వెల్లడించారు. కనెక్టివిటీకి సంబంధించి సర్వే జరుగుతోందని, ఏప్రిల్‌లో టెండర్లు పిలిచి వచ్చే నవంబర్‌లో పనులు మొదలుపెట్టే యోచనతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే, రైల్వే ప్రయాణికుల భద్రత, రైళ్ల సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు వెల్లడించారు. ఎంఎంటిఎస్ రెండో దశ పనుల పర్యవేక్షణలో భాగంగా మంగళవారం సికిందరాబాద్ నుంచి ఘట్‌కేసర్ వరకు మీడియా టూర్ నిర్వహించారు. వౌలాలి నుంచి చర్లపల్లి వరకు, చర్లపల్లి నుంచి ఘట్‌కేసర్ వరకు ఎంఎంటిఎస్‌కు సంబంధించి ట్రాక్ నిర్మాణపు పనులు జరుగుతున్న తీరును జిఎం వివరించారు. అనంతరం ఘట్‌కేసర్‌లో పోటో ఎగ్జిబిషన్, చర్లపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. వికె యాదవ్ మాట్లాడుతూ 2013 నుంచి ప్రారంభమైన ఎంఎంటిఎస్ పనులు స్థల సేకరణలో ఇబ్బందులతో ఆలస్యమైనప్పటికీ, అన్ని సమస్యలు అధిగమించి శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. రెండోదశలో భాగంగా ఈ ఏడాది చివరినాటికి మొదటి కారిడార్ అంటే తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు పూర్తి చేసి ఎంఎంటిఎస్‌ను పట్టాలెక్కిస్తామన్నారు. 2018 డిసెంబర్ నాటికి రెండోదశ పనులు పూర్తి చేస్తామని వివరించారు. దాదాపు రు.817 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మూడింట రెండొంతుల ఖర్చు భరిస్తుందని, ఇందులో భాగంగా ఇప్పటికే రు.60 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. మరో రు.160 కోట్ల నిధులు కోరామన్నారు. వౌలాలి నుంచి సనత్‌నగర మార్గంలో డిఫెన్స్ స్థల వివాదం కారణంగా మధ్యలో ఆటంకం ఏర్పడినప్పటికీ, ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయాయన్నారు. 24 గంటలూ అప్రమత్తంగా పనిచేస్తున్న రైల్వే సిబ్బంది సంక్షేమానికీ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
చర్లపల్లి పనులు వేగవంతం
నగర శివారులోని చర్లపల్లి జంక్షన్ నిర్మాణ పనులు ఈ ఏడాది ప్రారంభిస్తామని యాదవ్ వివరించారు. జంక్షన్‌లో కొత్తగా 6 ఫ్లాట్‌పారమ్‌ల ఏర్పాటుకు పనులు ప్రారంభించి ఐదేళ్ల కాలంలో పూర్తి చేస్తామన్నారు. దాదాపురు.80 కోట్లతో చేపడుతున్న జంక్షన్ పనులకు సంబంధించి స్థల సేకరణ కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించామని, అందుబాటులోవున్న 50 ఎకరాలతోపాటు, మరో 150 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కోరామన్నారు. సమస్యలు త్వరలోనే పరిష్కరించి జంక్షన్ నిర్మాణ పనులు మొదలుపెడతామన్నారు.

చిత్రం..ఎంఎంటిఎస్ రెండోదశ పనులు పరిశీలిస్తున్న రైల్వే జిఎం