రాష్ట్రీయం

ఊళ్లు అటూ.. ఇటూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత కొన్ని కొత్త జిల్లాల పేర్లను మార్చడంతోపాటు, కొన్ని గ్రామాలను ఒక మండలం నుండి మరొక మండలంలోకి, ఒక జిల్లా నుంచి మరో జిల్లాలోకి మార్పులు చేర్పులు చేసింది. ఈమేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజి గోపాల్ పేరుతో వేర్వేరుగా 14 ఉత్తర్వులు (జిఓలు) జారీ అయ్యాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా జారీచేసిన ఎక్స్ట్రార్డినరీ గెజిట్‌లో మార్పులు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. కొత్తపేర్లతో గెజిట్ నోటిఫికేషన్ మంగళవారం జారీ చేశారు. కొమరంభీమ్ జిల్లా పేరును ‘కుమురం భీమ్’గా మార్చారు.
మహబూబ్‌నగర్ జిల్లాను పునర్వ్యవస్థీకరించిన తర్వాత ఏర్పడ్డ జోగులాంబ జిల్లా పేరును ‘జోగులాంబ గద్వాల’గా మార్చారు. ఇదే జిల్లాలోని గట్టుమండలంలోని అప్‌కొండనహల్లి గ్రామాన్ని కెటిదొడ్డి మండలంలోకి మార్చారు. ముస్లింపల్లి గ్రామాన్ని గట్టుమండలంలో చేర్చారు. ఆలంపూర్ మండలంలోని శాలిపూర్, ఖానాపూర్ గ్రామాలను ఉండవెల్లి (న్యూ) మండలంలోకి మార్చారు. అలాగే ఆలంపూర్ మండలంలో ఉన్న మంగంపేట, రాయిమాకులకుంట, పోసల్‌పాడు గ్రామాలను మానోపాడు మండలంలోకి మార్చారు.
యాదగిరి జిల్లా పేరును ‘యాదగిరి భువనగిరి’గా మార్చారు. రాజన్న జిల్లా పేరును ‘రాజన్న సిర్సిల్లా’ గా మార్చారు. ఖమ్మం జిల్లాలోని కల్లూర్‌ను ‘కల్లూరు’గా మార్చారు. కరీంనగర్ (రూరల్) పేరును ‘కరీంనగర్ (రూరల్-1)గా మార్చారు. ఇదే జిల్లాలోని కొత్తపల్లి మండలంపేరును ‘కరీంనగర్-2’గా మార్చారు. రంగారెడ్డి జిల్లాలోని చౌదర్‌గూడెం పేరును ‘జిల్లేడ్ చౌదర్‌గూడెం’గా మర్చారు.
మేడ్చెల్- మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్ గండిమైసమ్మ పేరును ‘గండిమైసమ్మ దుండిగల్’గా మార్చారు. అలాగే ఇదే జిల్లాలోని ఉప్పల్ బగాయత్ పేరును ‘ఉప్పల్ భగాయత్’గా మార్చారు. రామంతపూర్ బగాయత్ పేరును ‘రామంతపూర్ భగాయత్’గా మార్చారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఖానాపూర్ పేరును ‘చిక్దారి ఖానాపూర్’గా మార్చారు. నిర్మల్ జిల్లాలో నిర్మల్ (యు) పేరను నిర్మల్ రెవెన్యూ డివిజన్‌గా మార్చారు. నిర్మల్ మండలం పేరును నిర్మల్ (యు)గా మార్చారు. వనపర్తి జిల్లాలోని ఘర్కాసా, అన్‌పహాడ్ గ్రామాలను ఘన్‌పూర్ మండలంలో చేర్చారు. లింగసాన్‌పల్లి గ్రామాన్ని చిన్నంబావి (న్యూ) మండలంలో చేర్చారు. గుంపన్‌పల్లె గ్రామాన్ని శ్రీరంగాపూర్ (న్యూ) మండలంలో, రామేశ్వరపురం గ్రామాన్ని పెబ్బేరు మండలంలో, అమరావతినగర్ గ్రామాన్ని మదనాపూర్ (న్యూ) మండలంలో, రంగాపూర్ గ్రామాన్ని అమరచింత (న్యూ)లో, రేవల్లె (న్యూ) మండలంలోని ఏదుల గ్రామాన్ని గోపాల్‌పేట మండలంలో కలిపారు.
వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండంలోని హకీంపేట, పోలెపల్లి గ్రామాలను మహబూబ్‌నగర్ జిల్లా కొస్గి మండలంలో కలిపారు. సిద్ధిపేట జిల్లాలోని కూటిగల్, కొండాపూర్ గ్రామాలను మద్దూరు మండలంలో చేర్చారు. సిద్ధిపేట జిల్లా కొండపాల మండలంలో అంకిరెడ్డిపల్లి, కొండపాక, కోనాయిపల్లి, కుకునూర్‌పల్లి, గిరాయిపల్లి, జప్తినాచారం, తిప్పారం, తిమ్మారెడ్డిపల్లి, దుద్దెడ, బండారం, మంగోల్, మతపల్లి, మేదిపల్లి, మర్పడగ, ముద్దనూర్, ఎర్రవల్లి, లక్డారం, వెలికట్ట, విశ్వనాథ్‌పల్లి, సింగారం, సిర్సినగండ్ల గ్రామాలను చేర్చారు. అలాగే మిర్‌దొడ్డి మండలంలో ధర్మర్మ, కొండాపూర్, మిర్‌దొడ్డి, కాసులాబాద్, మోతే, అల్వాల్, మల్లుపల్లి, చేప్యాల, అందె, లింగుపల్లి, రుద్రారం, ఖాజీపూర్, జంగపల్లి, వీరారెడ్డిపల్లి, అల్మాస్‌పూర్, భూంపల్లి, కూడవెల్లి గ్రామాలను చేర్చారు. ఇలాఉండగా తొగుట మండలంలో ఘనిపూర్, భండార్‌పల్లి, ఎల్లారెడ్డిపేట, పెద్దమాసన్‌పల్లి, తుక్కాపూర్, కంగల్, గుడికందుల, లింగంపేట, తొగుట, చందాపూర్, వెంకట్రావుపేట, లింగాపూర్, జప్తిలింగారెడ్డిపల్లి, ఏటిగడ్డకిస్టాపూర్, వేములఘాట్, పల్లెపహాడ్ గ్రామాలను చేరుస్తూ తాజాగా జీఓ జారీ చేశారు.