రాష్ట్రీయం

విధ్వంసానికి కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి కుట్ర పన్నారన్న ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) హెచ్చరికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం చేశాయ. ‘ఉగ్ర’దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర డిజిపిలను ఆదేశించింది. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్, శంషాబాద్ విమానాశ్రయం సహ వ్యూహాత్మక ప్రాంతాల్లో పోలీస్ బలగాలను మోహరించారు. విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడలో అదనపు బలగాలు మోహరించాయి. దక్షిణాది రాష్ట్రాలే టార్గెట్‌గా ఉగ్రదాడులు జరగొచ్చని, ఉగ్రవాదులు రాష్ట్రాల్లోకి చొరబడ్డారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇండియన్ ముజాహిదీన్, ఐసిస్ ఉగ్రవాద సంస్థలు దక్షిణాది రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులకు ఆయుధాలు సమకూర్చినట్టు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో తెలంగాణ జిల్లాల్లోని అన్ని జిల్లా కేంద్రాలతోపాటు, నగరాలు, పట్టణాల్లో భద్రత చర్యలు చేపట్టాలని, వాహన తనిఖీలు, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించాలని తెలంగాణ డిజిపి అనురాగ్‌శర్మ, ఆంధ్రా డిజిపి సాంబశివరావు రాష్ట్రాల్లోని అన్నీ జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. గణతంత్ర వేడుకల సందర్భంగా లౌడ్ స్పీకర్లు, వౌత్ స్పీకర్లు వాడకూడదని, వీలైనంత త్వరగా రిపబ్లిక్ వేడుకలు పూర్తి చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో డాగ్ స్క్వాడ్, అశ్వదళాలు, ప్రత్యేక దళాలతో భద్రత పెంచాలని డిజిపిలు ఆదేశించారు.