రాష్ట్రీయం

రాయితీ రికార్డులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: సినీనటుడు బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు వినోదం పన్ను మినహాయింపులు ఇచ్చేందుకు సంబంధించి రికార్డులను సమర్పించాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య శాఖను ఆదేశించింది. వినోదం పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సిబి ఆదర్శకుమార్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది పివి కృష్ణయ్య వాదనలు వినిపించారు. అనంతరం ఈ కేసుపై కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఏపి వాణిజ్య శాఖను, సినిమా నిర్మాతను ఆదేశిస్తూ విచారణను ఈనెల 31వ తేదీకి వాయిదా వేసింది.
సెట్ టాప్ బాక్స్‌లపై వివరణ ఇవ్వండి
ఈ నెల 31వ తేదీలోగా సెట్ టాప్ బాక్స్‌లను రెండుతెలుగు రాష్ట్రాల్ల్నో మున్సిపాలిటీల్లో కేబుల్ టివి కనెక్షన్ ఉన్న వారు కొనుగోలు చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై వివరణ ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేబుల్ టివి కనెక్షన్ ఉన్న వారు తప్పనిసరిగా సెట్ టాప్ బాక్సులను కొనుగోలు చేయాలని నిర్బంధిస్తున్నారని, ఇది సరైన విధానం కాదంటూ హైకోర్టులో సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ తరఫున దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ నెల 31వ తేదీలోపల సెట్ టాప్ బాక్స్‌ను అమర్చుకోకపోతే ప్రసారాలు ఉండవని కేంద్రం పేర్కొన్నదని పిటిషనర్ తరఫున న్యాయవాది సి రామచంద్రరాజు పేర్కొన్నారు. అనంతరం కోర్టు వారం రోజుల లోపు కేంద్రం నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.