రాష్ట్రీయం

ఎవరు అడ్డొచ్చినా ఆగను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 26: ‘ప్రత్యేక హోదాకు సరి సమానమైన ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దాన్ని ఆమోదించాల్సి వచ్చింది.ప్రత్యేక హోదాకు, ప్యాకేజీకి తేడా లేదన్న విషయాన్ని పదే పదే చెపుతున్నా.ప్రతిపక్ష నాయకుడు ప్రత్యక్ష హోదా గురించి ఎందుకు పట్టుపడుతున్నారో అర్థం కావడం లేద’ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం రాత్రి విశాఖలో విలేఖరుల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు ప్రతి రాజకీయ నాయకుడికి ఒక అజెండా ఉంటుందని, అది ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉండాలని అన్నారు. రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకోవం, వీలైనంత వరకూ గందరగోళ పరిస్థితులు సృష్టించడం నేర చరిత్ర కలిగిన ప్రతిపక్ష నాయకునికి అజెండాగా ఉందని ఆయన అన్నారు. ప్యాకేజీ విషయంలో ప్రజలు తను చెప్పిన వాస్తవాలను అర్థం చేసుకుంటున్నారని, కానీ యువత, విద్యార్థుల జీవితాలను నాశనం చేసేందుకు జగన్ హోదా ఉద్యమాన్ని మళ్లీ లేవనెత్తుతున్నారని చంద్రబాబు విమర్శించారు. హోదా రాకపోతే, పారిశ్రామిక రాయితీలు రావని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. గడచిన రెండేళ్లలో 927 కొత్త ప్రాజెక్ట్‌లు రాష్ట్రానికి వచ్చాయని, వీటి ద్వారా 5,03,978 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు.ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వస్తాయన్న జీఓ ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో తనను నమ్ముకుని ప్రజలు ఓట్లు వేట్లేశారని, అభివృద్ధిని కాంక్షిన తాను ఎవరు అడ్డు వచ్చినా ముందుకే సాగుతానని స్పష్టం చేశారు. తన కర్తవ్యాన్ని ఎవ్వరూ గుర్తు చేయనక్కర్లేదని చంద్రబాబు చెప్పారు. విధ్వంసాలు, అరాచకాలు సృష్టించేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా హోదా గురించి పోరాటానికి సిద్ధపడుతున్నారు, ఆయనతో చర్చిస్తారా? అని విలేఖరులు ప్రశ్నించగా, ఆయన కొత్తగా పార్టీ పెట్టారు. పూర్తిగా ఆయన అజెండా తెలిసిన తరువాత చూద్దాం. అని బాబు బదులిచ్చారు.
అధికారులను బెదిరిస్తారా?
ప్యాకేజీకి వీలైనంత త్వరగా చట్టబద్ధతను తీసుకువస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌ను పోలీస్ అధికారులు అడ్డుకున్నప్పుడు మరో రెండేళ్లలో తాను అధికారంలోకి వస్తానని, మీ అంతు చూస్తానని జగన్ పోలీసులను బెదిరించిన విషయాన్ని విలేఖరులు సిఎం దృష్టికి తీసుకువెళ్లగా, నేరాలకు అలవాటు పడినవారు అలానే మాట్లాడతారని, ఇటువంటి వారు రాజకీయ పదవుల ముసుగులో మరిన్ని నేరాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు అన్నారు.
గణతంత్ర దినోత్సవం రోజున నిరసనలు తెలపకూడదన్న ఉద్దేశంతోనే జగన్ నిరసనకు అనుమతి ఇవ్వలేదని, ఈ విషయాన్ని కూడా ఆయన గుర్తించకుండా, ఎయిర్‌పోర్టులో బైఠాయించడం శోచనీయమని అన్నారు. ఇదే సమయంలో భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అతిథులు జగన్ చర్యల వల్ల చాలా ఇబ్బందులకు గురయ్యారని చంద్రబాబు చెప్పారు. మన అధికారులు క్షమాపణలు చెప్పి, వారికి స్వాగతం పలికారని అన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం తాను పనిచేస్తున్నానని, నేరాలకు అలవాటుపడి ప్రజల మన్ననలు పొందలేని నాయకుడు చేస్తున్న వికృత చేష్టలను ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదని చంద్రబాబు చెప్పారు.