రాష్ట్రీయం

హోరెత్తిన విజయవాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 26: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్లతో విజయవాడ నగరం హోరెత్తింది. నగరం నడిబొడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ నేతృత్వంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో తెల్లవారుజామునుంచే సాయుధ పోలీస్ బలగాలు నగరమంతటా మోహరించాయి. వ్యూహాత్మకంగా ప్రతిపక్ష వైకాపా నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కె పార్థసారథి, మాజీ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, వంగవీటి రాధాకృష్ణ, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నాయకురాలు పుణ్యశీల తదితరులను గృహ నిర్బంధం చేశారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ మొత్తంపై 300 మందికి పైగా అరెస్ట్ కాగా, 150 మంది గృహ నిర్బంధానికి గురయ్యారు. అరెస్టయిన వారిలో ఒక ప్రాంతం వారిని మరో ప్రాంతానికి తరలించి అక్కడి పోలీస్ స్టేషన్‌లలో నిర్బంధించారు. ఇక వామపక్షాలు, కాంగ్రెస్, విద్యార్థి, యువజన, కార్మిక సంఘాల నేతలు, కార్యకర్తల నిరసనలతో బెజవాడ నగరం, పరిసరాలు హోరెత్తాయి. అరెస్ట్ చేసి వాహనాల్లో తరలించే సమయంలో ఆందోళనకారులు ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’.. ‘చంద్రబాబు, వెంకయ్యనాయుడు డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేశారు. లెనిన్ సెంటర్, కాళేశ్వరరావు మార్కెట్, ప్రకాశం బ్యారేజీ, తదితర ప్రాంతాలకు తరలివచ్చిన వారిని వచ్చినట్లే ముందుగా సిద్ధం చేసుకున్న వాహనాల్లోకి బలవంతంగా ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మధ్యాహ్నం వరకు అరెస్ట్‌ల పర్వం కొనసాగుతూనే వుంది. ఇక అరెస్టయిన వారిని రాత్రి 9 గంటల వరకు కూడా విడిచిపెట్టలేదు. అరెస్టయిన ప్రముఖుల్లో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, పిసిసి ప్రధాన కార్యదర్శులు నరహరశెట్టి నరసింహారావు, మీసాల రాజేశ్వరరావు, రాజీవ్ రతన్, అధికార ప్రతినిధులు వి గురుమూర్తి, సిపిఎం నేతలు సిహెచ్ బాబూరావు, కె శ్రీదేవి తదితరులు ఉన్నారు.

చిత్రం..విజయవాడలో హోదాకోసం ఆందోళన చేస్తున్న కాంగ్రెస్, జనసేన కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు