రాష్ట్రీయం

నగదు రహిత తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: తెలంగాణ రాష్ట్రం వేగంగా నగదు రహితంగా మలచడానికి తన ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటోందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉద్ఘాటించారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాల కోసం తెలంగాణ నిరంతరం తపన పడుతోందని, జల వివాదాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోందని నరసింహన్ పేర్కొన్నారు. గురువారం 68వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో ఆయన జాతీయ పతాకావిష్కరణ చేసి వివిధ పోలీసు, సైనిక బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామి గౌడ్‌లతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పతాకావిష్కరణ అనంతరం గవర్నర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పొరుగురాష్ట్రాలతో స్నేహసంబంధాలు నెలకొల్పుకోవడంలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వంలో ఒప్పందం కుదుర్చుకుని గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయన్నారు.
నగదు రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే సిద్ధిపేట నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామన్నారు. ఈ నియోజకవర్గంలోని ఇబ్రహింపూర్ ఇప్పటికే నగదురహిత గ్రామంగా పేరుతెచ్చుకున్నదన్నారు. దేశంకోసం పాటుపడుతున్న సైనికుల సంక్షేమంకోసం ఏటా 80 కోట్లరూపాయలను సేకరించి కార్పస్‌ఫండ్‌కు జమ చేస్తున్నామన్నారు. పదవీ విరమణ చేసిన సైనికులు, వితంతువులకు డబుల్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ (ఇఓడిబి) లో దేశంలో మొదటిస్థానం సంపాదించి అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ అన్నారు. కేవలం 31 నెలల క్రితమే ఏర్పడ్డ తెలంగాణ పేదల అవసరాలను తీర్చడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వివరించారు. ప్రజలకు తాగునీటిని అందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ, సేద్యానికి నీటిని అందించేందుకు చేపట్టిన మిషన్ కాకతీయ పథకాలు అందరి మన్ననలను పొందాయన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేశామని, 10 జిల్లాలను 31జిల్లాలుగా మార్చామని, ఒక్కో జిల్లాలో సరాసరిని 3లక్షల కుటుంబాలు ఉంటున్నాయన్నారు.
కోటి ఎకరాలకు సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టామని గవర్నర్ నరసింహన్ తెలిపారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం ఎత్తిపోతల, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, భక్తరామదాసు ప్రాజెక్టు తదితర ప్రాజెక్టులను నిర్మిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం నీటిపారుదలకు 25వేల కోట్ల రూపాయలు కేటాయించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న 45,600 చెరువులను దశలవారీగా తాగునీటిని అందిస్తామన్నారు. వచ్చే మూడు దశాబ్దాలకు సరిపోయే విధంగా మిషన్ భగీరథ పనులు చేస్తున్నామన్నారు. ప్రధాని మోదీ ఈ పథకాన్ని గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండలో ప్రారంభించి అభినందించారన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్తు రంగంలో ఉన్నత స్థాయికి చేర్చామని, వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నామని గవర్నర్ తెలిపారు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంటోందని, 5800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను టిఎస్ జెన్‌కో చేపట్టిందన్నారు. అలాగే డిస్కంలు కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఉదయ్’ పథకంలో చేరాయన్నారు. సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ఏటా 36 లక్షల మంది లబ్ధిదారులకు 4900 కోట్ల రూపాయలు పించన్‌గా ఇస్తున్నామన్నారు. పేద ఎస్‌సిలకు ఒక్కో కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తున్నామని, ఇప్పటికే 9663 మందికి భూమి ఇచ్చామని, ఇందుకోసం 405కోట్లు ఖర్చు చేశామని గవర్నర్ తెలిపారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు, క్రైం రేటును తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని నరసింహన్ తెలిపారు. పోలీసుల్లో నైపుణ్యం పెంపొందిస్తూ, ఆధునిక సాంకేతిక విధానాలను నేరాల అదుపుకోసం వినియోగిస్తున్నామన్నారు. హ్యాక్‌ఐ, లాస్ట్ రిపోర్ట్, బాడీ వార్న్ కెమెరాస్ తదితర సేవలను చేపట్టామని, సామాజిక మాధ్యమాలను కూడా ‘స్మార్ట్ పోలీసింగ్’లో భాగంగా వినియోగిస్తున్నామన్నారు.
వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన శకటాలు తాము సాధించిన విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిఫలిస్తూ శకటాలను ప్రదర్శించాయి. విద్యార్థులు, కళాకారుల బృందాలు పరేడ్‌లో సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించాయి.

చిత్రం..సిఎం క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్