రాష్ట్రీయం

4.25 లక్షల కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 27:విశాఖలో శుక్రవారం ప్రారంభమైన సిఐఐ భాగస్వామ్య సదస్సులో తొలిరోజే ఏపీకి పెట్టుబడుల పంట పండింది. వివిధ సంస్థలు నాలుగు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. రాష్ట్ర పౌరసంబంధాల మంత్రి పల్లె రఘునాథరెడ్డి శుక్రవారం రాత్రి విలేఖరులకు ఈ వివరాలు తెలియజేశారు. రాజధాని అమరావతిలో సుమారు 800 కోట్ల పెట్టుబడితో వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు యుకె సంస్థ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇది అమరావతిలో నిర్మాణాలకు జరిగిన తొలి ఒప్పందమని మంత్రి చెప్పారు. అమరావతి సిఆర్‌డిఏ పరిధిలో యుకెకి చెందిన స్టేడీ ఎరెనా 800 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 28 ఎకరాల్లో ఆధునిక బహుళ ప్రయోజనాల క్రీడా శిక్షణా ప్రాంగణాన్ని, కనె్వన్షన్ సెంటర్‌ను నిర్మించడానికి కుదుర్చుకున్నారు. శుక్రవారం జరిగిన ఒప్పందాల్లో ఇంధన రంగంలోనే అత్యధికంగా ఒప్పందాలు జరిగాయి. సుమారు 93 వేల కోట్ల రూపాయల ఒప్పందాలు తొలి రోజు జరగడం విశేషం. ఇందులో గమేశ విండ్ టర్బైన్స్ లిమిటెడ్ 1750 కోట్లు, యాక్సిస్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ 700 కోట్లు, మైత్రా ఎనర్జీ ఇండియ లిమిటెడ్ 7000 కోట్లు, సుధీర్ ఇన్ఫాస్ట్రక్చర్ లిమిటెడ్ 6,300 కోట్లు, ఎక్రాన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ 5,950 కోట్లు, శ్రీసాయి పాశుమయి పవర్ లిమిటెడ్ 980 కోట్లు, న్యూ అండ్ రినవబుల్ ఎనర్జీ డవలప్‌మెంట్ కార్పొరేషన్ 28 కోట్లతో పవర్ ప్రాజెక్ట్ స్థాపించడానికి ముందుకు వచ్చాయి. మిసర్స్ సాయిపురం విండ్ 700 కోట్లు, మిసర్స్ అనిమాల్ విండ్ పవర్ లిమిటెడ్ 1050 కోట్లు, రాయల్ విండ్ పవర్ లిమిటెడ్ 700 కోట్లు, యాక్సిస్ విండ్ ఫార్మ్స్ లిమిటెడ్ 700 కోట్లు, యాక్సిస్ ఎనర్జీ గ్రఃప్ 12000 కోట్ల పెట్టుబడులతో పవర్ ప్రాజెక్ట్‌లను నెలకొల్పనున్నాయి. అలాగే మైత్రా ఎనర్జీ ఇండియ లిమిటెడ్ 6000 కోట్లు, ఎన్‌ఎల్‌సి ఇండియా లిమిటెడ్ 6000 కోట్లు, విఘ్నేశ్వర పవర్ లిమిటెడ్ 600 కోట్లు, గ్రీన్‌కో సోలార్ ఎనర్జీ లిమిటెడ్ 3600 కోట్లు, ఎపిజెన్‌కో 3000 కోట్లు, ఎసిఎంఇ క్లీన్‌టెక్ 900 కోట్లు, ఎఫ్‌ఆర్‌వి సోలార్ 600 కోట్లు, టాటా సోలార్ 600 కోట్లు, ఎజూర్ పవర్ ఇండియా లిమిటెడ్ 300 కోట్లు, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ ఎనర్జీ డవలప్‌మెంట్ లిమిటెడ్ 5000 కోట్లు, ఈసెల్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 675 కోట్లు, ఎన్వికరి ఎల్‌ఎల్‌పి 36 కోట్లు, వి తార ఎనర్జీ గ్రూప్ 1950 కోట్ల పెట్టుబడులతో ముందుకు వచ్చాయి.
ఐటి రంగంలో 68 ఒప్పందాలు
శుక్రవారం జరిగిన ఒప్పందాల్లో ఐటి రంగానికి సంబంధించి 68 ఒప్పందాలు జరిగాయి. సీట్, డిక్సాస్ టెక్నాలజీస్, ఇంథనీ గ్లోబల్, రియోరిచ్ హెల్త్‌కేర్, ఎన్‌ఎస్‌ఎల్ మైనింగ్, నియో ఫార్మా, నెక్స్ట్ ఆర్టిట్ వెంచర్ ఫండ్, ఐనాక్స్ విండ్, అప్లెస్‌ప్లస్, చెంగ్డూ జిరాంగ్, ఆర్‌ఇసి సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే చమురుశుద్ధి రంగంలో 80 వేల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. ఈ కంపెనీలలో సుమారు ఐదు లక్షల 50 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని మంత్రి రఘునాథరెడ్డి చెప్పారు. ఈ సదస్సుకు 50 దేశాలకు చెందిన సుమారు రెండు వేల మంది ప్రతినిధులు హాజరయ్యారని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా రెండో రోజు 5.83 లక్షల కోట్లతో 585 ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని మంత్రి పల్లె తెలియచేశారు. వీటి వలన 14 లక్షల 92 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని ఆయన చెప్పారు.

చిత్రం..భాగస్వామ్య సదస్సులో ఎంఒయులు కుదుర్చుకున్న ప్రతినిధులతో ముఖ్యమంత్రి