రాష్ట్రీయం

ఎసిబి వలలో ప్రకాశం డిఇఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జనవరి 27:ప్రకాశం జిల్లా విద్యాశాఖ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖాధికారులు శుక్రవారం రాత్రి మెరుపుదాడులు నిర్వహించారు. చీరాలకు చెందిన బాజీబాబా పాఠశాలకు అనుమతి ఇచ్చేందుకు లంచం ఇవ్వాలని నిర్వాహకురాలు కె శివపార్వతిని జిల్లా విద్యాశాఖాధికారి సుప్రకాశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నిర్వాహకురాలు అంగీకరించి 30 వేల రూపాయల సొమ్మును డిఈవో ఆదేశాల మేరకు సీనియర్ అసిస్టెంట్ రమణయ్యకు ఇస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్టు ఎసి బి అధికారులు చెప్పారు. డిఇవో ను, సీనియర్ అసిస్టెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడు ల్లో ఎసిబి డిఎస్‌పి ఆర్‌విఎస్‌ఎన్ మూర్తి, సిఐలు ప్రతాప్‌కుమార్, సంజీవకుమార్ పాల్గొన్నారు.

చిత్రం..విద్యాశాఖాధికారి సుప్రకాశ్