రాష్ట్రీయం

బుద్ధిమాంద్యులకు షెల్టర్లు నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: నిర్లక్ష్యానికి గురవుతున్న మానసిక బుద్ధి మాంద్యులకు ప్రత్యేక షెల్టర్లు నిర్మించి వారి ఆలనాపాలనా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని హైకోర్టు పేర్కొంది. జైళ్లలో బాలనేరస్థులు, మహిళా ఖైదీలు, వారి పిల్లలు, బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న విచారణ ఖైదీలకు కల్పిస్తున్న సదుపాయాలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎటువంటి నేరాలకు పాల్పడకుండా జైళ్లలో ఉంటున్న మానసిక బుద్ధిమాంద్యుల సంరక్షణకు మార్గదర్శకాలను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఏపి లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సివి నాగార్జునరెడ్డి, జస్టిస్ టి రజనితో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. జైళ్లలో ఉన్న బాల, మహిళా నేరస్థులు, బుద్ధిమాంద్యుల సంరక్షణకు రెండు రాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో మెంబర్ సెక్రటరీ కోర్టును అభ్యర్థించారు. రెండు రాష్ట్రాల్లో ఇండ్లలో ఉన్న బుద్ధిమాంద్యత ఉన్న వారి స్థితిగతులపై సర్వే జరిపాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది ఎస్ శరత్ కుమార్ వాదనలు వినిపిస్తూ, సర్వే వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందన్నారు. నిర్లక్ష్యానికి గురైన వారి గురించి సర్వే చేయడాన్ని ఆర్థిక భారంగా భావించరాదని హైకోర్టు పేర్కొంది.