రాష్ట్రీయం

ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి అంతర్జాతీయ గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: దేశంలో ప్రసిద్ధి గాంచిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అమెరికా సొసైటీ ఆఫ్ కాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జరీ సంస్థ నెలకొల్పిన ఆప్తాల్మాలజీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సభ్యత్వం దక్కింది. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావు స్థాపించారు. అమెరికా సంస్థ మే 6వ తేదీన నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో గుళ్లపల్లి ఎన్ రావును సత్కరించనున్నారు. 1999లో అమెరికాలో ఆప్తాల్మాలజీ హాల్ ఆఫ్ ఫేమ్‌ను ప్రారంభించారు. అందులో 55 మంది శాస్తవ్రేత్తలు సభ్యత్వం పొందారు. నేడు ఆ సంఖ్య 30వేలకు చేరింది. కంటివైద్యంలో అత్యాధునిక శస్త్ర చికిత్సా పద్ధతులను వాడుకలోకి తీసుకురావడంలో వీరంతా చేసిన సేవలు అనన్యసామాన్యమని ఎఎస్‌సిఆర్‌ఎస్ పోర్టల్‌లో పేర్కొన్నారు. హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరడం చాలా సంతోషదాయకమని డాక్టర్ రావు పేర్కొన్నారు.

చిత్రం..డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావు