రాష్ట్రీయం

అనుకున్నది సాధించారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 28: ‘కంటిమీద కునుకులేకుండా కష్టపడుతున్న ముఖ్యమంత్రిని మిమ్మల్లే చూస్తున్నాను. మీరే కాకుండా మీతో పనిచేసే మంత్రులు, అధికార యంత్రాగంతో కూడా అదే విధంగా పనిచేయిస్తున్నారు. వీటన్నిటి ఫలితంగానే గత రెండు రోజులుగా జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో మీరనుకున్న దానికన్నా ఎక్కువ పెట్టుబడులు
వచ్చాయి. ఇప్పుడు హాయిగా నిద్రపోండి! ప్రకాశవంతమైన సూర్యోదయంతో మళ్లీ మేల్కొనండి!’ అని గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. విశాఖలో రెండు రోజులపాటు జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు సదస్సులో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భావి తరాలు బాగుండాలన్న సదాశయంతో చంద్రబాబు శ్రమిస్తున్నారని అన్నారు. అందుకు ఈ భాగస్వామ్య సదస్సే నిదర్శనమని చెప్పారు. విభజన తరువాత సరికొత్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి చంద్రబాబు పునాది వేశారు. ప్రజలకు సుపరిపాలనను అందిస్తూ లక్ష్యాలను సాధించే దిశగా బాబు అడుగులు ముందుకు వేస్తున్నారని నరసింహన్ అన్నారు. ప్రజలకు ఆహార, ఆరోగ్య భద్రత చాలా అవసరమని నరసింహన్ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా విరివిగా వినియోగించుకోవాలని ఆయన చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
పెట్టుబడులకు ఏఫి సేఫ్!
వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉండచ్చు. ఆ పెట్టుబడులను ఏపిలో పెట్టుకుంటే సేఫ్‌గా ఉంటాయని రాష్ట్ర తొలి పౌరునిగా తాను చెపుతున్నానని గవర్నర్ చెప్పారు. ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన వాతావరణం ఉంది. భవిష్యత్ తరాలకు ఎటువంటి ఇబ్బందిలేని ప్రాంతం ఏపి అని గవర్నర్ అన్నారు. ఉయార్ రడీ..ఆర్ యు?.. అంటూ ఒక నినాదాన్ని తాను వింటున్నాను. ఉయార్ రడీ..ఆర్ యు అని పారిశ్రామికవేత్తలు బాబును ప్రశ్నిస్తున్నారని గవర్నర్ నరసింహన్ చంద్రబాబుపై ఛలోక్తి విసిరారు.

చిత్రం..గవర్నర్ నరసింహన్‌కు జ్ఞాపికను అందజేస్తున్న చంద్రబాబు