రాష్ట్రీయం

రోడ్లకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 28: వచ్చే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ లోపల, బయట లక్ష కోట్ల రూపాయలతో జాతీయ రహదారులను నిర్మిస్తామని ని కేంద్ర రోడ్డు రవాణ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. విశాఖలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజైన శనివారం జరిగిన ప్లీనరీ సెషన్‌లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు దూర దృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. అందుకే ఆయన కోరిన ఏ ప్రాజెక్ట్‌నైనా మంజూరు చేస్తున్నామని చెప్పారు. తాను మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి దేశంలో రోజుకు రెండు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగేదని, ప్రస్తుతం దాన్ని రోజుకు 18 కిలోమీటర్లకు పెంచామని, వచ్చే మార్చినాటికి రోజుకు 30 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని గడ్కరీ చెప్పారు. దేశంలో ఉన్న రహదారుల్లో 40 శాతం జాతీయ రహదారులని ఆయన చెప్పారు. ఈ రోడ్లపై ఏటా ఐదు లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయని, 1.50 లక్షల మంది చనిపోతున్నారని ఆయన తెలియచేశారు. సాగరమాల ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రతిత్మకంగా తీసుకుందని గడ్కరి చెప్పారు. పోర్టులకు రైలు, రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధానోద్దేశమని ఆయన వివరించారు. ఇప్పటికే లక్ష కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేశామని చెప్పారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్, పోర్టులు తదితర సంస్థలకు గత సంవత్సరం ఆరు వేల కోట్ల రూపాయల లాభాలు వచ్చాయని, ఆ మొత్తంతోనే రోడ్లను విస్తరిస్తున్నామని మంత్రి చెప్పారు. దేశంలో 2,702 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయని ఆయన చెప్పారు. వచ్చే మూడు నెలల్లో 1200 కోట్ల ప్రాజెక్ట్‌లకు అనుమతులు ఇవ్వనున్నామన్నారు. ఆరు వేల కోట్ల రూపాయలతో విశాఖ పోర్టు ట్రస్ట్‌లో వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, మరో 7,500 కోట్ల రూపాయలతో పోర్టు సమీప తీరాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీకాకుళం-విజయవాడ, విజయవాడ-నెల్లూరు మధ్య ఇండస్ట్రియల్ కారిడార్లు నిర్మిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతో వౌలిక సదుపాయాలు కల్పించనున్నామని ఆయన తెలిపారు. దేశంలోని 111 నదులను జలరవాణాకు అనువుగా తీర్చిదిద్దనున్నామని ఆయన చెప్పారు. బకింగ్‌హామ్ కెనాల్ పనులను నెల రోజుల్లో ప్రారంభిస్తామని గడ్కరి హామీ ఇచ్చారు. ఇందుకు 2000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని, ఇందులో కొంత భాగం విశాఖ పోర్టు ట్రస్ట్ భరిస్తుందని ఆయన చెప్పారు. అలాగే ఈ కెనాల్ లోతును పెంచే బాధ్యతను డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు ఎంఓటి విధానంలో ఇవ్వాల్సిందిగా గడ్కరీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతి, అనంతపురం మధ్య రహదారి నిర్మాణానికి భూసేకరణ పనులు మొదలయ్యాయని మంత్రి గడ్కరీ వివరించారు. విశాఖ-రాయపూర్ మధ్య ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారని, దీన్ని వెంటనే మంజూరు చేస్తామని గడ్కరీ చెప్పారు. అలాగే కామన్ రోడ్ ఫండ్ కింద 1000 కోట్ల రూపాయలను రాష్ట్రానికి మంజూరు చేస్తున్నట్టు గడ్కరి ప్రకటించారు. అలాగే ఏపిలో 3,500 కోట్లతో 30 రోడ్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని గడ్కరీ హామీ ఇచ్చారు.

చిత్రం..రహదారుల నిర్మాణానికి సంబంధించి కుదుర్చుకున్న ఎంఒయులతో గడ్కరీ, చంద్రబాబు, శిద్దా రాఘవరావు