రాష్ట్రీయం

ఫిబ్రవరి తొలి వారంలో అర్బన్ హౌసింగ్‌కు టెండర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 29: అర్బన్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి వచ్చే నెల తొలి వారంలో టెండర్లు పిలవనున్నట్టు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నగరాలకు సమీపంలోనే ఇళ్ల నిర్మాణాలకు అనువైన స్థలాలను ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు. ‘అందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 1.93 లక్షల ఇళ్లలో 73వేల వ్యక్తిగత ఇళ్లు మినహాయిస్తే మిగిలిన 1.2 లక్షల ఇళ్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నట్టు చెప్పారు. టర్నల్, షీట్‌వాల్ టెక్నాలజీతో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారా వచ్చే 18 నెలల కాలంలో మంజూరైన 1.93 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పేర్కొన్నారు.
గతంలో నిర్మించిన రాజీవ్ గృహకల్ప, జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్లు పట్టణాలకు దూరంగా ఉండటంతో పాటు వౌలిక వసతులు లేకపోవడం కూడా ఇళ్లలో చేరేందుకు విముఖత వ్యక్తం అవుతోందన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని బహుళ అంతస్తుల భవనాలు నిర్మించే ప్రాంతంలో బేసిక్, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.