రాష్ట్రీయం

అంతా ఏకపక్షమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 5: రాష్ట్రంలో పాలకపక్షం తీరు ఘోరంగా ఉందని, ఇదే సమయంలో ప్రభుత్వంపై పోరాటంలో విపక్షం పూర్తిగా విఫలమైందని పిసిసి చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తల ఒకరోజు శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు మంగళవారం విశాఖ వచ్చిన ఆయన మాట్లాడుతూ పాలన మొత్తం ఏకపక్షంగా సాగుతోందన్నారు. శాసనసభ శీతాకాల సమావేశాలు జరిగిన తీరు చూస్తే అసలు చట్టసభలకు అర్థం లేకుండా పోయిందనే భావన కలుగుతోందన్నారు. ఒక శాసనసభ్యురాలి సస్పెన్షన్‌ను సాకుగా తీసుకుని సభను స్తంభింపచేశారన్నారు. విపక్షం లేకుండానే సభను కొనసాగించి దుష్ట సంప్రదాయానికి అధికార పక్షం తెర తీసిందన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన చట్టసభను ఈ విధంగా దుర్వినియోగం చేసినందుకు పాలక, విపక్షాలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బాక్సైట్ త్వవకాలపై తీసుకున్న నిర్ణయాన్ని జగన్‌మోహన్‌రెడ్డి తప్పుపట్టడంపై రఘువీరా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని రఘువీరా స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలుండగా రాజధాని అంశాన్ని మాత్రమే చంద్రబాబు ప్రాధాన్యతాంశంగా భావించడం సరికాదన్నారు. ఇక రాష్ట్రంలో కొత్త తరహా అవినీతికి తెలుగుదేశం ప్రభుత్వం తెరతీసిందని ఆరోపించారు. అధికార పార్టీ సభ్యులు పాల్పడుతున్న అవినీతికి అంతేలేదని, దోచుకోవడం తప్ప ప్రజలకు సేవచేయాలన్న ధ్యాస లేదన్నారు. జన్మభూమి పేరిట జరుగుతున్న సభల్లో తెలుగుదేశం కార్యకర్తల హవా కొనసాగుతోందని ధ్వజమెత్తారు. పచ్చచొక్కాల కార్యకర్తలకు జన్మభూమి కమిటీల్లో చోటు కల్పించడంతో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందట్లేదని ఆరోపించారు.