రాష్ట్రీయం

విద్యుత్ చార్జీల వడ్డన స్వల్పమే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: తెలంగాణ డిస్కాంలు విద్యుత్ చార్జీలను స్వల్పంగా పెంచి ఆ మేరకు ప్రతిపాదనలను ఈ నెల 31న విద్యుత్ నియంత్రణ మండలికి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇప్పటికే డిస్కాంలు 22,044 కోట్ల రెవెన్యూ అవసరమని, 32,844 ఎంయు విద్యుత్ అవసరం ఉంటుందని అంచనాలను మండలికి సమర్పించాయి. రాష్ట్రప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ కింద దాదాపు రూ.3000 కోట్ల వరకు భరించేందుకు సిద్ధంగా ఉంది. విద్యుత్ లోటును పూడ్చుకునేందుకు దాదాపు 3.5 నుంచి 4.5 శాతం పైన చార్జీలను పెంచుతూ ప్రతిపాదనలు సమర్పించనున్నట్లు తెలిసింది. చార్జీల భారంనుంచి నెలకు వంద యూనిట్ల వరకు వినిమయం చేసే వినియోగదారులను మాత్రం మినహాయించే అవకాశం ఉంది. డిస్కాంలు ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్‌లో పబ్లిక్ హియరింగ్‌ను నిర్వహించనుంది. అనంతరం ప్రతిపాదిత చార్జీలపై తన నిర్ణయం ప్రకటించనుంది. ఇప్పటికే డిస్కాంలకు సంబంధించిన 8వేల కోట్లరూపాయల రుణాలను రాష్ట్రప్రభుత్వం స్వీకరించింది. డిస్కాంల రుణ భారాన్ని తగ్గించినందువల్ల భారీగా విద్యుత్ చార్జీలను పెంచే అవకాశాలు లేవని విద్యుత్‌శాఖ వర్గాలు తెలిపాయి. కాగా వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నందువల్ల అదనంగా 1500 మెగావాట్ల విద్యుత్‌ను అవసరమని డిస్కాంలు గుర్తించాయి. ఈ మేరకు విద్యుత్‌ను స్వల్పకాలిక కొనుగోళ్ల ప్రాతిపదికను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.