రాష్ట్రీయం

‘్భక్తరామదాసు’ స్ఫూర్తితో మరిన్ని ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 29: స్వల్ప కాలంలో నిర్మించిన భక్తరామదాసు ప్రాజెక్టు స్ఫూర్తితో రాష్ట్రంలో మరిన్ని ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడతామని, గోదావరి నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఆదివారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ కేవలం 11నెలల కాలంలోనే అతి తక్కువ ఖర్చుతో భక్తరామదాసు ప్రాజెక్టును పూర్తిచేసి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న యజ్ఞాన్ని ప్రారంభించామన్నారు. కేవలం 170 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, మరో 160 కోట్ల రూపాయలు పైపులు, మోటార్ల తరలింపుతో పాటు భూసేకరణకు వెచ్చించామని తెలిపారు. అనాలోచితంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 2013-్భసేకరణ చట్టాన్ని అమలు చేయటంలో ఇబ్బందులున్నా రైతుల అభీష్టం మేరకు కొనసాగిస్తున్నామని, ఇదే సమయంలో తమ ప్రభుత్వం తెచ్చిన 123-జీవోను కూడా పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. ఈ రెండింటిలో రైతుకు లాభం జరిగేదానికే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కేంద్రం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం ద్వారా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఒక్క ఎకరమూ సేకరించలేక పోయాయని మంత్రి తుమ్మల ఉదహరించారు. ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టుల కోసం గత పాలకులు తీసుకొచ్చిన పైపులు, మోటార్లు నిరుపయోగంగా ఉన్నాయని, అందుకే వాటిని ఈ ప్రాజెక్టుకు వినియోగించామన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఇప్పుడు భక్తరామదాసులో వినియోగిస్తున్న మోటార్లు తీసివేసి వేరే ప్రాజెక్టుకు వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రజలకు మంచినీరు, రైతులకు సాగునీరు అందించలేకపోతే రాష్ట్రం ఏర్పడి ఉపయోగం లేదని, అందుకే కృష్ణా బేసిన్‌లో నీరుండే పరిస్థితి లేనందున గోదావరి బేసిన్‌లో నీటిని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. భూపాలపల్లి జిల్లా పరిధిలోని తుపాకులగూడెం వద్ద రిజర్వాయర్ నిర్మించి కాకతీయ కాలువల ద్వారా నీరు సరఫరా చేయాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. గడచిన పదేళ్ల కాలంలో తాము చేయలేని పనిని చేస్తున్నందుకు ఓర్వలేక కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఆరోపణలు చేస్తున్నారని, అందులో కూడా స్పష్టత లేదని ఆయన విమర్శించారు. ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, నిరుపయోగమని అంటూనే తమ ప్రాంతాలకు నీరివ్వాలని డిమాండ్ చేయటం ఆశ్చర్యకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమ కోసం పనిచేస్తోందని, ప్రాజెక్టుల నిర్మాణంలో అవసరమైనవి గత పాలకులు కొనుగోలు చేసి ఎక్కడ ఉంచినా తెలుసుకొని వాటిని వినియోగంలోకి తెస్తామన్నారు. కరవు ప్రాంతాలను ఆదుకోవాలని చెపుతున్న పార్టీలు ఆ ప్రాంతాల్లో ప్రాజెక్టులు కడితే ఆరోపణలు చేయటం సహేతుకం కాదని, విమర్శలు మాని సహకరించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.

చిత్రం..భక్తరామదాసు ప్రాజెక్టు వద్ద మంత్రి తుమ్మల